విధాత, హైదారాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘం నేతల మధ్య ఘర్షణ చెలరేగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈనెల 18న బీసీ సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్ కు మద్దతివ్వాలని కోరేందుకు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును కలిశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో నేతల మధ్య ఫొటోల విషయంలో గుజ్జా సత్యం, గుజ్జా కృష్ణ మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
కృష్ణయ్య, రాంచందర్ రావు వారించినా శాంతించలేదు. వారి ముందే తోపులాట, ఘర్షణకు దిగారు. అతికష్టం మీద వారిని సహచర నాయకులు అదుపు చేశారు. ఈ పరిణామం క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీ పార్టీ కార్యాలయంలో చోటుచేసుకోవడంతో ఆ పార్టీ నాయకత్వం ఖంగుతింది.
ఇటీవల రామచంద్రరావు కరీంనగర్ జిల్లా పర్యటనలో ఆయన ముందే పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్, బీజేపీ ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాస్ లు పరస్పరం తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగడం తెలిసిందే.
ఫోటో కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న బీజేపీ, బీసీ సంఘాల నేతలు
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చోటు చేసుకున్న ఘటన
ఈ నెల 18న తాము చేపట్టే రాష్ట్ర బంద్‌కి మద్దతు ఇవ్వాలని కోరేందుకు..
BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుని కలిసిన ఆర్ కృష్ణయ్య, BC నేతలు
ప్రెస్‌మీట్… pic.twitter.com/eT2NNMShgz
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 15, 2025