Telangana Rising Global Summit : గ్లోబల్ సమ్మిట్..తాజా వీడియోలతో బీఆర్ఎస్ ఎటాక్

ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో నెలకొన్న తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ వీడియోలతో విరుచుకుపడింది. రూ. 100 కోట్ల ప్రజాధనంతో "డేరా నగర్" వేసి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రోడ్డున పడేశారని మండిపడింది.

Telangana Rising Global Summit

విధాత : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ప్రాంతం ఎంపికపై విమర్శలు ఎక్కుపెడుతున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తాజాగా సమ్మిట్ ముగిశాక ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై వీడియో ను వైరల్ చేస్తూ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తుంది. గ్లోబల్ సమ్మిట్ లో తొలగించిన డేరాలు, దారులలో ఏర్పాటు చేసిన కటౌట్లు, సెట్టింగ్ ల తొలగింపు దృశ్యాలతో వీడియో చిత్రీకరించారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం నిరాదరణ వాతావరణంలో కనిపిస్తుంది.

“డేరా నగర్” పీకేసి, కాంగ్రెస్ తల్లిని రోడ్డున పడేసిన రేవంత్ అంటూ ..ఈ వీడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తుంది. అన్ని సౌకర్యాలతో ఉన్న హైదరాబాద్ నగరంలో సకల హంగులున్న కన్వెన్షన్ సెంటర్లు ఉండగా.. రూ.100 కోట్ల ప్రజాధనం వృథా చేసి “డేరా నగర్” లో రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పెట్టాడని, తన రియల్ ఎస్టేట్ దందా కోసం రేవంత్ ఊహానగరి ఫోర్త్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ పేరిట, రెండు రోజుల తమాషా కోసం వేసిన టెంట్ల ఖర్చు వంద కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని విమర్శలు చేసింది. కేవలం రెండు రోజుల రియల్ ఎస్టేట్ దందా కోసం రేవంత్ రెడ్డి రూ. 100 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశాడని ఆరోపించింది.

రైతులకు, విద్యార్థులకు, వృద్దులకు, పేదలకు, మహిళలకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడానికి పైసా లేదు అంటూ, తన జల్సాల కోసం వందల కోట్లు తగలేస్తున్నాడని విమర్శించింది. తాజాగా ఫుట్ బాల్ స్టార్ మెస్సీతో ఆటకు రేవంత్ రెడ్డి రూ.100కోట్లు ఖర్చు పెట్టడంపైన కూడా బీఆర్ఎస్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Koti Womens University : కోఠి మహిళా విశ్వ విద్యాలయంలో విద్యార్థినిల ఆందోళన..మెస్ ఇన్ చార్జి సస్పెండ్
Bade Chokka Rao : పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు?

Latest News