Koti Womens University : కోఠి మహిళా విశ్వ విద్యాలయంలో విద్యార్థినిల ఆందోళన..మెస్ ఇన్ చార్జి సస్పెండ్

కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపులపై విద్యార్థినిల ఆందోళనకు దిగారు. ఆరోపణల నేపథ్యంలో మెస్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేస్తూ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Koti Womens University

విధాత, హైదరాబాద్ : కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిలకు వేదింపులు ఎదురైన ఘటన కలకలం రేపింది. ఉన్నత చదువులకు వేదికగా నిలవాల్సిన విశ్వ విద్యాలయంలో చదుకునే యువతులకు రక్షణ కరువైన వైనం తీవ్ర దుమారం రేపుతుంది. నగరం నడిబొడ్డులోని కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ, యూజీ చదువుతున్న విద్యార్థులు తమకు ఎదురవుతున్న వేధింపులపై ఐలమ్మ స్ఫూర్తితో ఆందోళనకు దిగారు. సినిమా షూటింగ్‌ల సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని యూనివర్సీటీ పాలక వర్గాన్ని డిమాండ్ చేశారు.

తమకు ఎదురవుతున్న వేధింపులపై పీజీ విద్యార్థులు మీడియాకు వివరించారు. పీజీ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో వసతి కల్పిస్తున్నారని..అక్కడ వారిపై మెస్ ఇన్ చార్జి వినోద్ వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఇప్పటికే హాస్టల్ వార్డెన్ కు, వీసీకి, ప్రిన్సిపాల్ కు ఆధారాలతో ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై షీటీమ్ కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఈ రోజు యూనివర్సిటీలో దీనిపై ఆందోళన వ్యక్తం చేసి.. ప్రిన్సిపాల్ కు మరోసారి ఫిర్యాదు చేశామని తెలిపారు.

సినిమా షూటింగ్ ల వేళ..యూనిట్ సిబ్బంది వేధింపులు

అలాగే యూనివర్సిటీలో దర్బార్ హాల్ లో యూనివర్సిటీ నిధుల సమీకరణలో భాగంగా సినిమా షూటింగ్ లకు అనుమతులిస్తున్నారని..అయితే షూటింగ్ ల సందర్బంగా తమతో యూనిట్ సభ్యులు అసభ్యంతగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినిలు ఆరోపించారు. ఇటీవల శివ కార్తికేయన్, శ్రీలీల నటిస్తున్న ‘పరాశక్తి’ షూటింగ్ సమయంలో తమతో యూనిట్ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. హీరోయిన్ శ్రీలీల పక్కన సైడ్ క్యారెక్టర్ ఇస్తామని మభ్యపెట్టి.. ఇద్దరు విద్యార్థినులను క్యారావ్యాన్‌లో నిర్బంధించారని తెలిపారు. ఇలాంటివి జరుగకుండా రక్షణ కల్పించాలని, యూనివర్సిటీలో, హాస్టల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 650మంది హాస్టల్ లో మూడు సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆందోళనకు దిగొచ్చిన ప్రిన్సిపాల్ ..మెస్ ఇన్ చార్జి సస్పెండ్

కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినిల ఆందోళనకు దిగొచ్చిన ప్రిన్సిపాల్ లోక పావని స్పందించారు. వేధింపుల ఆరోపణల నేపథ్యంలో యూనివర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌లో మెస్‌ ఇన్ చార్జి వినోద్‌ను సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు. యూనివర్సిటీలో సినిమా షూటింగ్ లను సెలవు రోజుల్లోనే అనుమతిస్తామని తెలిపారు. 7వేల మంది విద్యార్థుల యూనివర్సిటీలో వారి భద్రత, భరోసాకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి :

Bade Chokka Rao : పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు?
IndiGo crisis Marxist analysis | ఇండిగో సంక్షోభం లేవనెత్తే ప్రశ్నలు, నేర్పే పాఠాలు – ఒక విశ్లేషణ

Latest News