విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డితో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందం భేటీ అయ్యింది.
ఐటీ, ఫార్మా, ఎయిరోస్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఈ సందర్భంగా చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కెనడా హైకమిషనర్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హైకమిషనర్ ను కోరారు. ముఖ్యంగా స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లో పెట్టుబడులకు ముందుకు రావాలని రేవంత్ రెడ్డి కోరారు.
ఈ సమావేశంలో మేడమ్ కారెన్, కెనడా మినిస్టర్ ఎడ్ జాగర్, ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
