Heavy Rains | హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్.. మ‌రో 2 గంట‌ల్లో భారీ వ‌ర్షం..!

Heavy Rains | గ‌త మూడు రోజుల నుంచి ఉక్క‌పోత‌తో ఇబ్బంది ప‌డుతున్న హైద‌రాబాదీల‌కు( Hyderabad ) శుభ‌వార్త‌. ఆదివారం నాడు న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం( Heavy Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు.

Heavy Rains | హైద‌రాబాద్ : హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌ర వాసులు మ‌ళ్లీ అప్ర‌మ‌త్తం కావాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఎందుకంటే మ‌రో 2 గంట‌ల్లో హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం( Heavy Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్‌మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్నందున న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

ప‌టాన్ చెరు, ఆర్సీపురం, శేరిలింగంప‌ల్లి, గ‌చ్చిబౌలి, మియాపూర్, కూక‌ట్‌ప‌ల్లి, గాజుల‌రామారం, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల‌, సుచిత్ర‌, అల్వాల్, మ‌ల్కాజ్‌గిరి, కాప్రా, బొల్లారంతో పాటు ప‌లు ప్రాంతాల్లో రాబోయే 2 గంట‌ల్లో వాన దంచికొట్ట‌నుంది. ఈ వ‌ర్షాలు న‌గ‌ర‌మంతా విస్త‌రించే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి న‌గ‌ర ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని తెలంగాణ వెద‌ర్‌మ్యాన్ హెచ్చ‌రించారు.

ఇక గ‌త మూడు నాలుగు రోజుల నుంచి న‌గ‌రంలో ఎండ‌లు దంచికొడుతున్న సంగ‌తి తెలిసిందే. వేస‌విని త‌ల‌పించే వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. రాత్రిపూట అయితే ఉక్క‌పోత‌కు గురై ప్ర‌జ‌లు అల్లాడిపోయారు. ఇవాళ మ‌ళ్లీ వ‌ర్షాలు కురిస్తే కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించే అవ‌కాశం ఉంది.

Exit mobile version