Kallem Narsimha Reddy : బతికుండగానే విగ్రహం..స్వీయ ఆవిష్కరణ!

అమెరికాలో ఉత్తమ రైతుగా అవార్డు పొందిన కళ్లెం నర్సింహారెడ్డి, తన వ్యవసాయ క్షేత్రంలో భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకుంటూ వార్తల్లో నిలిచారు.

Kallem Narsimha Reddy

విధాత, హైదరాబాద్: బతికుండగానే ఓ రైతు బిడ్డ తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడంతో స్వయంగా తానే విగ్రహాన్ని ఆవిష్కరించుకోనున్న ఓ రైతు బిడ్డ కథ వైరల్ గా మారింది. తెలంగాణ పల్లె నుంచి అమెరికా దాకా పంటల సాగులో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రైతు బిడ్డ కళ్లెం నర్సింహా రెడ్డి ఇప్పుడు మరో రకంగా వార్తల్లోకి ఎక్కారు. తన వ్యవసాయ క్షేత్రంలో తన భార్య కళ్లెం లక్ష్మి విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకునేందుకు సిద్దమయ్యారు. భార్య లక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా రేపు శుక్రవారం కళ్లెం దంపతుల విగ్రహాలను ఆవిష్కరించబోతున్నారు.

నర్సింహారెడ్డి గతంలోనే తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దివంగత భార్య లక్ష్మిపై ఉన్న ప్రేమతో రాజస్థాన్ లో ఆమె విగ్రహం కూడా తయారు చేయించారు. తన విగ్రహం పక్కనే భార్య విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. ఈ విగ్రహాలు స్వయంగా ఆయనే ఆవిష్కరించనుండటం విశేషం.

తెలంగాణ నుంచి అమెరికా దాక సాగులో జైత్రయాత్ర

చిలుకూరుకు చెందిన కళ్లెం నర్సింహారెడ్డి(89) వ్యవసాయ రంగంపై అవగాహన ఉన్నవారికి సుపరిచితమే. పదో తరగతి మాత్రమే చదివిన నరసింహారెడ్డి 30ఏండ్లు అమెరికాలో నివసించి..ఆ దేశంలో 5వేల ఎకరాలను లీజుకు తీసుకుని రకరకాల పంటలను సాగు చేసి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. అంతేగాక అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ నుంచి ఉత్తమ రైతు అవార్డు కూడా అందుకున్నారు.

కొన్నాళ్ల క్రితం అనూహ్యాంగా నర్సింహారెడ్డి మాతృభూమి..సొంతూరుపై మమకారంతో తెలంగాణకు తిరిగి వచ్చారు. చిలుకూరు సమీపంలో కళ్లెం నర్సింహా రెడ్డి పేరుతో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తమ సాగు పద్దతులతో పేరు గడించిన కళ్లెం ఇప్పుడు తన సొంత ఫామ్ లో మొక్కలు…చెట్లు పెంచి ప్రకృతి ఒడిలో జీవితం గడుపుతున్నారు. 89ఏండ్ల వయసులోనూ తన పనులన్నీ తానే చేసుకోవడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో నిత్యం తిరుగుతూ.. తోటలను, పంటలను పర్యవేక్షిస్తుంటడం విశేషం. ఆయన తోటలో మొక్కలు, పూలు, పండ్ల తోటలతో పాటు ఆకర్షణీయమైన కొటేషన్స్ మరింత ఆకట్టుకునేలా ఉండటం అందరినిఆకర్షిస్తుంటుంది.

ఇవి కూడా చదవండి :

Dacoit Teaser | ఆస‌క్తి రేపుతున్న డెకాయిట్ టీజ‌ర్.. డాక్ట‌ర్ కాదు దొంగనా?
Tiger Attack : అడవి మధ్యలో కారు ఆపాడు..పులికి చిక్కాడు

Latest News