Dacoit Teaser | ఆస‌క్తి రేపుతున్న డెకాయిట్ టీజ‌ర్.. డాక్ట‌ర్ కాదు దొంగనా?

Dacoit Teaser | అడివి శేష్ తెరపై కనిపించి ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. ఈ మధ్య నాని ‘హిట్ 3: ది థర్డ్ కేస్’లో చిన్న క్యామియో చేసినప్పటికీ, అది అభిమానులను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయింది. దీంతో శేష్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల మధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Dacoit Teaser | అడివి శేష్ తెరపై కనిపించి ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. ఈ మధ్య నాని ‘హిట్ 3: ది థర్డ్ కేస్’లో చిన్న క్యామియో చేసినప్పటికీ, అది అభిమానులను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయింది. దీంతో శేష్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల మధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి షానియోల్ డియో దర్శకత్వం వహించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మంచి ఫామ్‌లోకి వచ్చిన భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్‌గా నిలుస్తోంది. మొదట హీరోయిన్‌గా శృతి హాసన్‌ను ఎంపిక చేయగా, తరువాత ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్న విషయం తెలిసిందే.

టీజర్‌లో కథను పూర్తిగా చెప్పకుండా, కాన్సెప్ట్‌ను మాత్రమే రివీల్ చేశారు. “అనగనకా ఒక దొంగ” గా అడివి శేష్ ఎంట్రీ ఇచ్చాడు. దోపిడీలు చేసి జైలుకు వెళ్లడం అతనికి మామూలు విషయమే అన్నట్టు పాత్రను చూపించారు. ఇంతలో అతని ముందుకు ఓ ప్రమాదకరమైన మిషన్ వస్తుంది. దాన్ని ఒప్పుకున్న శేష్, అనుకోకుండా ఓ అమ్మాయి (మృణాల్ ఠాకూర్)తో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఒకవైపు మాఫియా, మరోవైపు పోలీసులు వీరిద్దరిని వెంటాడుతూ ఉంటారు. శత్రువుల నుంచి తప్పించుకుంటూ, ప్రాణాల మీదకు తెచ్చుకునే ముప్పులను ఎదుర్కొంటూ ఈ జంట సాగించే జర్నీ ఆసక్తికరంగా చూపించారు. అసలు డెకాయిట్ ఒప్పుకున్న మిషన్ ఏంటి? ఆ అమ్మాయితో శేష్‌కు ఉన్న లవ్ ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూడాల్సిందే. ముఖ్యంగా మాస్ టచ్ ఉన్న పాత్రలో అడివి శేష్ పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాడు.

టీజర్‌లో మరో ప్రత్యేక ఆకర్షణగా నాగార్జున ‘హలో బ్రదర్’లోని చార్ట్‌బస్టర్ సాంగ్ ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’ ను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా రీమిక్స్ చేసి వాడటం డిఫరెంట్ ఫీల్ ఇచ్చింది. దర్శకుడు షానియోల్ డియో టేకింగ్ కొంతవరకు లోకేష్ కనగరాజ్ స్టైల్‌ను గుర్తు చేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అడివి శేష్–మృణాల్ ఠాకూర్ జోడీని కూడా రెగ్యులర్ లవర్ పెయిర్‌లా కాకుండా వినూత్నంగా ప్రెజెంట్ చేయడం ఆకట్టుకుంది. మొత్తం మీద టీజర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో ‘డెకాయిట్’ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున ‘దురంధర్ 2’ను కూడా షెడ్యూల్ చేయడం విశేషంగా మారింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీకి రంగం సిద్ధమైంది.

 

Latest News