KE Prabhakar : రాయదుర్గంలో కే.ఈ.ప్రభాకర్ తుపాకీ కాల్పులు

హైదరాబాద్ రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కే.ఈ.ప్రభాకర్ తుపాకీ కాల్పులు జరిపి కలకలం రేపారు. ఇంటి వివాదం నేపధ్యంలో ఘటన చోటుచేసుకుంది.

KE Prabhakar

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ రాయదుర్గంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రాయదుర్గం పీఎస్ పరిధిలోని మణికొండలో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కే.ఈ.కృష్ణమూర్తి సోదరుడు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత కే.ఈ.ప్రభాకర్ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఓ ఇంటి వివాదంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో ప్రభాకర్ అక్కడి ఉన్నవారిని పంపించేందుకు కాల్పులు జరిపినట్లుగా సమాచారం.

ఇరువర్గాలు కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అద్దెకు ఇచ్చిన ఇల్లు వెంటనే ఖాళీ చేయించే క్రమంలో కేఈ ప్రభాకర్‌ కాల్పులకు దిగాడని, అగ్రిమెంట్‌ ఉన్నప్పటికి..బాధితులను ఆయన గన్నుతో బెదిరించాడని బాధితులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన పదిరోజల క్రితం జరిగిందని..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది.