- ఐకానిక్ బిల్డింగ్‌గా టీ స్క్వేర్
- నవంబర్‌లో పనులు ప్రారంభం
- ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్: సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబర్ 11 (విధాత): నవంబర్ నెల చివరి వరకు టీ స్క్వేర్ పనులు ప్రారంభం కావాలని, టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్‌గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఐసీసీసీలో ఏఐ హబ్,టీ స్క్వేర్ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీ స్క్వేర్ నిర్మాణం లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. టీ స్క్వేర్ లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ లో భవనాలను పరిశీలించాలని, ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. ఏఐ లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ,స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, సంజయ్ కుమార్,సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజీఐఐసీ ఎండీ శశాంక ,టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ , ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా ,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.