Lifestyle Desk / Lifestyle / 19th August 2025
Immigration Tips | విదేశీ ప్రయాణంలో ఇమ్మిగ్రేషన్ చెక్ అత్యంత కీలకం. అదే సమయంలో మీరు మాట్లాడే మాటలు మీ ప్రవేశాన్ని సౌకర్యవంతంగా చేయగలవు లేదా ఆలస్యం లేదా తిరస్కరణకు కూడా దారి తీయవచ్చు. కింద 7 మాటలు/వాక్యాలు అసలు చెప్పకూడదు; వాటి బదులుగా ఎలా సమాధానం ఇవ్వాలో కూడా ఇచ్చాం.
1) “నేను ఎక్కడ ఉండబోతున్నానో తెలియదు(I Do Not Know Where I Am Staying)”
ఎందుకు కుదరదు: ప్లాన్ లేకుండా వచ్చారని అనుమానం వస్తుంది.
బదులుగా చెప్పండి: “ఈ హోటల్‌లో బుకింగ్ ఉంది. ఇది కన్ఫర్మేషన్.(This is my Hotel Booking)” (ప్రింటౌట్/పిడిఎఫ్ చూపండి)
చిట్కా: కేన్సిలబుల్ హోటల్ బుకింగ్ అయినా తీసుకెళ్లండి.
2) “నేను ఓ పని కోసం వచ్చాను(I Am Here To Work)” (Work Visa లేకుండా)
ఎందుకు కుదరదు: వీసా షరతులను ఉల్లంఘిస్తున్నారనే సందేహం.
బదులుగా చెప్పండి: “బిజినెస్ మీటింగ్/సెమినార్ కోసం షార్ట్ విజిట్. లోకల్ జాబ్ చేయను.(Just to attend a business meeting as a short visit)”
చిట్కా: ఇన్వటేషన్ లెటర్ /ఈవెంట్ పాస్ ఉంటే చూపండి.
3) “ఆన్‌లైన్‌లో కలిసిన ఫ్రెండ్‌ని చూడటానికి వచ్చాను(I Am Just Visiting A Friend I Met Online)”
ఎందుకు కుదరదు: సంబంధం స్పష్టత లేకపోతే అనుమానం.
బదులుగా చెప్పండి: “స్నేహితుడు/బంధువును సందర్శించడానికి వచ్చాను. ఇది వారి పూర్తి చిరునామా.(To visit my Son / Relatives)”
చిట్కా: కాంటాక్ట్ నెంబర్, అడ్రెస్, అవసరమైతే ఆహ్వాన లేఖ.
4) “రిటర్న్ టికెట్ లేదు(I Do Not Have A Return Ticket)”
ఎందుకు కుదరదు: ఎక్కువకాలం ఉండే ప్రమాదం ఉందని భావిస్తారు.
బదులుగా చెప్పండి: “ఇది నా రిటర్న్/ఆన్‌వర్డ్ ట్రావెల్ టికెట్. ఫ్లెక్సిబుల్ ఫేర్.(This is my Return Ticket)”
చిట్కా: రీఫండబుల్/చేంజబుల్ టికెట్ సరిపోతుంది.
5) “ఇక్కడకు వచ్చాక చూస్తాను(I Will Figure Things Out When I Am Here)”
ఎందుకు కుదరదు: ప్లాన్ లేని టూరిస్ట్‌గా కనిపిస్తారు.
బదులుగా చెప్పండి: “3 నగరాలు చూడబోతున్నాను—ఈ తేదీల్లో ఇవే ప్లేసులు. ఒక రోజు టూర్ బుక్ చేసుకున్నాను.(To see some adorable place around California. Toor booked)”
చిట్కా: రఫ్ ఇటినరరీ ఒక పేజీ ప్రింటౌట్‌లో ఉంచుకోండి.
6) డ్రగ్స్/బాంబులు/నేరాలపై జోకులు
ఎందుకు కుదరదు: సెక్యూరిటీ వద్ద జోకు అనేది జోకు కాదు—డిటైన్ అవ్వచ్చు.
బదులుగా చేయండి: సమాధానాలు చిన్నగా, మర్యాదగా, సీరియస్‌గా చెప్పండి.
7) “నా దగ్గర డబ్బులు సరిపోవు (I Do Not Have Enough Money With Me)”
ఎందుకు కుదరదు: స్వయంసమృద్ధి (proof of funds) లేదు అనిపిస్తుంది.
బదులుగా చెప్పండి: “స్టేకు సరిపడా ఫండ్స్ ఉన్నాయి. ఇది బ్యాంక్ స్టేట్మెంట్/క్రెడిట్ కార్డ్.(Had enough funds to stay)”
చిట్కా: గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్, అంతర్జాతీయ కార్డ్, కొంత నగదు—మూడూ ఉత్తమం.
తప్పుగా మాట్లాడితే ఏమవుతుంది?
తక్షణమే వెనక్కి పంపకపోయినా రెండవ తనిఖీకి తీసుకెళ్లొచ్చు—మరిన్ని ప్రశ్నలు, లగేజ్ చెక్, డాక్యుమెంట్ల ధృవీకరణ. ఇది కొన్ని గంటల పాటు సాగవచ్చు. కఠినమైన కేసుల్లో ఎంట్రీ డినై/వీసా క్యాన్సిల్ అవ్వొచ్చు.
సులువైన ఇమ్మిగ్రేషన్ కోసం 5 సులభ చిట్కాలు
1. హోటల్ బుకింగ్, రిటర్న్ టికెట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రింట్లతో వెళ్ళండి.
2. ప్రశ్నలకు చిన్నగా—పాయింట్‌కి సమాధానం ఇవ్వండి.
3. ఫైళ్లన్నీ ఒక ఫోల్డర్‌లో—పాస్‌పోర్ట్, వీసా, బుకింగ్స్.
4. అవసరం లేని వ్యక్తిగత వివరాలు అతిగా పంచుకోవద్దు
5. శాంతంగా ఉండండి; నేరుగా కళ్లలోకి చూస్తూ, ధైర్యంగా మాట్లాడండి.
ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉద్యోగం/కుటుంబం గురించి అడుగుతారా?
అడగొచ్చు. ఇది మీ పర్పస్ ఆఫ్ ట్రావెల్ వీసాతో సరిపోతుందో లేదో చూసుకోవడం కోసం. నిజాయితీగా, చిన్నగా సమాధానం ఇవ్వండి—“ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. ఈ ట్రిప్ ఖర్చులు నేనే భరిస్తున్నాను(I’m a private employee, and all expenses are being borne by myself.).”
ఫోన్ చెక్ చేస్తారా?
కొన్ని దేశాల్లో అరుదుగా ఫోన్/లాప్‌టాప్ చూడొచ్చు. సాధారణంగా అడగరు; అడిగితే ప్రశాంతంగా సహకరించండి; మీ కథనం, డాక్యుమెంట్లతో సరిపోయేవిధంగా ఉండాలి.
ఇమ్మిగ్రేషన్‌కు ముందు తప్పనిసరి డాక్యుమెంట్లు
• పాస్‌పోర్ట్ (వాలిడిటీతో)
• వీసా (అవసరమైతే)
• రిటర్న్/ఆన్‌వర్డ్ టికెట్
• ఉండే చోటు బుకింగ్ ప్రూఫ్(హోటల్, బంధువుల ఇల్లు)
• నిధుల ప్రూఫ్ (బ్యాంక్ స్టేట్మెంట్స్/కార్డులు/క్యాష్)
అన్ని దేశాల్లో ఒకే నియమాలా?
పద్ధతి ఒకేలా అనిపించినా, దేశానికొకలా నిబంధనలు ఉంటాయి. US/UK/షెంజెన్ దేశాలు కొంత కఠినంగా ఉంటాయి; కొన్ని ఆసియా/మిడిల్ ఈస్ట్ దేశాలు రిటర్న్ టికెట్, ఫండ్స్‌పై ఎక్కువ దృష్టి పెడతాయి. ఎంబసీ లేదా ఆధికారిక మార్గదర్శకాలు ముందే చదవండి.
అధికారులు ఏం చూస్తారు?
మీ సమాధానాలు, వీసా టైపు, డాక్యుమెంట్లు మధ్య సారూప్యాన్ని. అధిక నివాసం/స్థానిక ఉద్యోగం/తప్పుడు సమాచారం ఇవ్వకపోవడాన్ని.
ప్రశ్నలు ఎంతసేపు పడుతాయి?
సాధారణంగా కొన్ని నిమిషాలు. సెకండరీ తనిఖీ అయితే 30–90 నిమిషాలు. కోపం/అసహనం చూపకుండా శాంతంగా సహకరించండి. మీ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.
ద్వితీయ తనిఖీ పడితే?
శాంతంగా ఉండండి. అడిగిన డాక్యుమెంట్లు వెంటనే ఇవ్వండి, నిజాయితీగా సమాధానాలు ఇవ్వండి. వాదనకు పోవద్దు—నర్వస్ బాడీ లాంగ్వేజ్ తప్పించండి.
ఫస్ట్-టైమ్ ట్రావెలర్ల కోసం 5 అదనపు టిప్స్
1. మీ వీసా షరతులు స్పష్టంగా తెలుసుకోండి.
2. లోకల్ కరెన్సీ (చిన్న మొత్తమే సరిపోతుంది) వెంట ఉంచుకోండి.
3. ఇమ్మిగ్రేషన్ ఫారమ్‌లో ఉన్న వివరాలకు కాంట్రాడిక్ట్ అవ్వకుండా సమాధానాలు ఇవ్వండి.
4. బుకింగ్స్/టికెట్ కాపీలు డిజిటల్ + ప్రింట్ రెండుగా ఉంచుకోండి.
5. మర్యాదగా, ధైర్యంగా, అల్ప పదాల్లో మాట్లాడండి.
Short Answers
• Purpose of visit? “Toursism.. for 10 days.”
• Where will you stay? “ABC Hotel—Here’s booking confirmation.”
• Return ticket? “Returning back on this date —This is the ticket.”
• Who pays? “All the expenses being borne by myself.”
ఇవి కూడా చదవండి..
GHMC Deputation Corruption | జీహెచ్ఎంసీలో తిష్ఠ వేసిన ‘డిప్యూటేషన్’
Garlic Benefits : వెల్లుల్లితో ప్రేమలో పడ్డానంటున్న చుంకీపాండే
సింహాలు చెట్లు ఎక్కుతున్నాయ్..వైరల్ గా వీడియో