ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థితో టీచ‌ర్ శృంగారం.. అరెస్టు చేసిన పోలీసులు

  • Publish Date - November 9, 2023 / 05:52 AM IST

అమెరికా : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచ‌రే వికృత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పించాల్సిన ఆమె కామంతో చెల‌రేగిపోయింది. ఏకంగా ఓ ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థిని లోబ‌ర్చుకుని శృంగారంలో పాల్గొన్నారు. బాధిత యువ‌కుడు గ‌త నెల ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఈ విష‌యం వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మౌంట్‌గోమెరి విలేజ్ మిడిల్ స్కూల్లో గ‌తంలో మెలిసా మేరి క‌ర్టిస్ టీచ‌ర్‌గా ప‌ని చేశారు. 2015లో అదే స్కూల్లో ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థితో క‌ర్టిస్ శృంగారంలో పాల్గొన్నారు.


అప్పుడు టీచ‌ర్ వ‌య‌సు 22 ఏండ్లు కాగా, విద్యార్థి వ‌య‌సు 14 ఏండ్లు. విద్యార్థిగా ఉన్న‌ప్పుడు త‌న‌ను లోబ‌ర్చుకుని, శృంగారంలో పాల్గొన్న‌ద‌ని బాధితుడు గ‌త నెల‌లో ఆరోప‌ణ‌లు చేశాడు. దీంతో పోలీసులు విచార‌ణ చేప‌ట్టి క‌ర్టిస్‌ను అరెస్టు చేశారు. బాధిత విద్యార్థికి ప‌లుమార్లు మ‌ద్యం తాగించి, గంజాయి ఇచ్చి టీచ‌ర్ క‌ర్టిస్ శృంగారంలో పాల్గొన్న‌ట్లు త‌మ విచార‌ణ‌లో తేలింద‌ని పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఎవ‌రైనా ఆమె బాధితులు ఉన్నారా? అన్న కోణంలో విచార‌ణ కొన‌సాగిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Latest News