మరోసారి నవ్వులపాలైన అమెరికా అధ్యక్షుడు..! కమలా హ్యారిస్‌ను ప్రెసిడెంట్‌ అంటూ..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తరుచూ వార్తల్లో నిలుస్తుటారు. పలు అంశాల్లో ప్రసంగిస్తూ ప్రతీసారి ఏదో ఒక పొరపాటు చేస్తూ వస్తుంటారు.

  • Publish Date - November 14, 2023 / 09:06 AM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తరుచూ వార్తల్లో నిలుస్తుటారు. పలు అంశాల్లో ప్రసంగిస్తూ ప్రతీసారి ఏదో ఒక పొరపాటు చేస్తూ వస్తుంటారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా మరోసారి అలాంటి తరహాలోనే వ్యాఖ్యలు చేస్తూ నవ్వుల పాలయ్యారు. సోమవారం శ్వేతసౌదంలో స్టాన్లీ కప్‌ గెలిచిన వెగాస్‌ గోల్డెన్‌ నైట్స్‌ టీమ్‌ను సత్కరించించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.


ఈ క్రమంలోనే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ప్రెసిడెంట్‌ అంటూ సంబోధించారు. దాంతో కార్యక్రమంలో పాల్గొన్న వారంతా అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు బైడెన్ పై మండిపడుతున్నారు. బైడెన్‌కు అమెరికా అధ్యక్షుడు ఎవరో కూడా తెలియదంటూ సెటైర్లు వేస్తున్నారు.


గతంలోనే పలుసార్లు బైడెన్‌ ఇలాంటి తరహాలోనే వ్యాఖ్యలు చేస్తూ నవ్వులపాలైన సందర్భాలున్నాయి. కమలా హ్యారిస్‌ను ఫస్ట్‌ లేడీగా సంబోధించారు. అయితే, అమెరికా అధ్యక్షుడి భార్యను మాత్రమే ఫస్ట్‌లేడిగా పిలిస్తుంటారు. గత సెప్టెంబ‌ర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రాపర్‌ ఎల్‌ఎల్‌జై కూల్ జే పేరును అబ్బాయి అంటూ తప్పుగా ఉచ్చరించారు.


ఈ వ్యాఖ్యలు విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే కెనడా పార్లమెంట్‌లోనూ ప్రసంగించిన సమయంలో అక్కడి వలస చట్టాల గురించి ప్రస్తావించారు. ఆ చట్టాలను ప్రశంసించే సమయంలో ‘కెనడా’ పేరుకు బదులుగా ‘చైనా’ పేరును ప్రస్తావించారు. ఆ తర్వాత తప్పును తెలుసుకొని సారీ చెప్పారు.