విధాత : స్థాన బలానికి నిదర్శనంగా నీళ్లలో మొసలి బలాన్ని ఉదహరిస్తుంటారు. భారతీయ పురాణాల్లో గజేంద్ర మోక్షం పురాణ ఘట్టం కూడా నీళ్లలో మొసలి బలానికి నిదర్శనం. అయితే ఓ ప్రోఫెషనల్ మొసళ్ల పెంపకం శిక్షకుడు మాత్రం ఎలాంటి భయం లేకుండా నీళ్లలో ఓ భారీ మొసలితో సయ్యాటలాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో..అతనికి ఎంత ధైర్యముంటే నీళ్లలో మొసలితో ఆటలాడుతారంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే ప్రొఫెషనల్ మొసళ్ల పెంపకం శిక్షకుడు క్రిస్ గిల్లెట్ ఫ్లోరిడా సరస్సులో తన 10 అడుగుల శిక్షణ పొందిన అమెరికన్ ఎలిగేటర్ కాస్పర్ మొసలితో నీటి అడుగున సరదాగా సంచరిస్తూ దానితో సయ్యాలాడారు. నీళ్లలో మొసళ్ల కదలికలు..వాటి జీవన శైలీ, శారీరక చర్యలను అధ్యయనం చేసే వీడియో చిత్రీకరణలో భాగంగా ఈ సాహసం చేశాడు.
వీడియోలో చూపిన విధంగా ఎలిగేటర్ జాతి మొసళ్లు గొంతు కండరాల సంకోచాల ద్వారా ఖచ్చితమైన తేలియాడే నియంత్రణను సాధిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ఊపిరితిత్తుల గాలి పరిమాణాన్ని సర్దుబాటు చేస్తాయని..వేట లేదా తప్పించుకోవడం కోసం సజావుగా తేలియాడటం.. మునిగిపోవడం వంటి చర్యలను కొనసాగిస్తాయని తేలింది. ఈ శిక్షణాపరమైన అధ్యయనం మనిషి-సరీసృపాల సహజీవనం, వాటి పరిరక్షణ విజ్ఞానాన్ని పెంపొందిస్తాయంటున్నారు. అయితే అదే సమయంలో ఏ మాత్రం తేడా వచ్చినా అడవి ఎలిగేటర్లు 2,000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు గల ప్రాణిపై కూడా దాడి చేస్తాయని..ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ డేటా ప్రకారం ప్రతి ఏటా పలువురు మొసళ్ల దాడులకు బలవుతున్నారని వెల్లడవ్వడం ఆందోళన కల్గిస్తుంది.
This is crazy 😳 pic.twitter.com/9dFvLFviro
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 5, 2025
