Intestines | బ్రేక్ ఫాస్ట్ చేస్తుండ‌గా విప‌రీత‌మైన ద‌గ్గు.. కడుపులో నుంచి బ‌య‌ట‌ప‌డ్డ పెద్ద ప్రేగు

Intestines | ఓ వ్య‌క్తి త‌న భార్య‌తో క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తుండ‌గా, అత‌నికి విప‌రీత‌మైన ద‌గ్గు వ‌చ్చింది. అదే స‌మ‌యంలో క‌డుపులో నుంచి పెద్ద ప్రేగు బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఆ వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు.

  • Publish Date - June 10, 2024 / 08:47 AM IST

Intestines | ఓ వ్య‌క్తి త‌న భార్య‌తో క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తుండ‌గా, అత‌నికి విప‌రీత‌మైన ద‌గ్గు వ‌చ్చింది. అదే స‌మ‌యంలో క‌డుపులో నుంచి పెద్ద ప్రేగు బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఆ వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన 63 ఏండ్ల వ్య‌క్తి గ‌తంలో ప్రోస్టేట్ క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు. చికిత్సలో భాగంగా అత‌నికి స‌ర్జ‌రీ నిర్వ‌హించి బ్లాడ‌ర్‌ను తొల‌గించారు. అత‌డి ఆరోగ్యం కుదుట ప‌డిన త‌ర్వాత డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జి అయిన కొద్ది రోజుల‌కు భార్య‌తో క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

ఇక భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తుండ‌గా, అత‌నికి విప‌రీత‌మైన ద‌గ్గు వ‌చ్చింది. ద‌గ్గుతుండ‌గానే క‌డుపులో నుంచి పెద్ద ప్రేగు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ర‌మ‌త్త‌మైన బాధిత వ్య‌క్తి ప్రేగుల‌ను చూసి షాక‌య్యాడు. త‌న ష‌ర్ట్‌తో ప్రేగుల‌ను క‌ప్పేశాడు. భార్య అంబులెన్స్‌కు కాల్ చేసింది. ఇక అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, ప్రేగుల‌ను క‌డుపు లోప‌లికి నెట్టి.. వైద్యులు చికిత్స చేశారు. ఆరు రోజుల త‌ర్వాత బాధిత వ్య‌క్తిని డిశ్చార్జి చేశారు.

అయితే ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌కు చికిత్స చేసిన‌ప్పుడు వేసిన కుట్లే ఇప్పుడు ఇచ్చుకుపోయాయి. ద‌గ్గు విప‌రీతంగా రావ‌డంతో ఆ కుట్లు ఇచ్చుకుపోయి ఉంటాయ‌ని, దాంతో పెద్ద ప్రేగు బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని వైద్యులు పేర్కొన్నారు. బాధితుడు ఆరోగ్యంగా ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

Latest News