Apple | యాపిల్‌ను సాయంత్రం వేళ తినకూడదట.. జర జాగ్రత్త..!
Apple | మీరు యాపిల్( Apple ) పండు తినాలనుకుంటున్నారా..? ఉదయం( Morning ), మధ్యాహ్నం( Afternoon ) వేళనే ఈ పండు తినేందుకు ప్రయత్నించండి.. సాయంత్రం( Evening ) వేళ అసలు తినకూడదట. మరి ఎందుకు తినకూడదో ఈ కథనంలో తెలుసుకుందాం..
Apple | యాపిల్( Apple ) పండు.. సకల రోగల నివారణి. రోజుకు ఒక యాపిల్ పండు తింటే.. డాక్టర్( Doctor ) వద్దకు వెళ్లాల్సిన పని లేదని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతుంటారు. ఎందుకంటే.. యాపిల్ పండు మనకు అనారోగ్య సమస్యలను( Health Issues ) దరి చేరనీయకుండా.. ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది. యాపిల్ వల్ల అధిక బరువు తగ్గడం( Weight Loss ) నుంచి మొదలు పెడితే.. జీర్ణ సమస్యల( Digestive Problems ) వరకు చక్కటి పరిష్కారం ఉంది. ఈ విధంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు యాపిల్ పండ్ల వల్ల కలుగుతాయి. అయితే ఆయుర్వేదం( Ayurveda ) ప్రకారం ఈ యాపిల్ పండ్లను ఏ సమయంలో తినాలి..? ఏ సమయంలో తినకూడదో తెలుసుకుందాం..
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. యాపిల్ పండ్లను తినేందుకు ఒక కచ్చితమైన సమయం ఉంది. ఉదయం( Morning ), మధ్యాహ్నం( Afternoon ) వేళ మాత్రమే యాపిల్ పండ్లను తినాలి. అది కూడా ఉదయం పరగడుపున అసలు తినొద్దు. తింటే మలబద్దకం, అసిడిటీ( Acidity ) సమస్యలు ఉత్పన్నమవుతాయి. అల్పాహారం( Breakfast ) తీసుకున్న గంట తర్వాత యాపిల్ పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు( health Experts ) సూచిస్తున్నారు. లేదా మధ్యాహ్నం లంచ్( Lunch ) చేశాక గంట విరామం ఇచ్చి యాపిల్‌ను తినొచ్చని చెబుతున్నారు. యాపిల్ పండులో ఫైబర్ ఉంటుంది. అందువల్ల బ్రేక్‌ఫాస్ట్ చేసిన గంట తరువాత తింటే సులభంగా జీర్ణమవుతుంది. అందులో ఉండే పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది.
మరి సాయంత్రం వేళ తినొచ్చా..?
ఉదయం, మధ్యాహ్నం ఓకే.. మరి సాయంత్రం వేళ యాపిల్ తినొచ్చా..? అంటే తినొద్దు అనే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. సాయంత్రం వేళ జీర్ణ రసాలు తక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. దీంతో జీర్ణ శక్తి ప్రక్రియ నెమ్మదిస్తుంది. అందువల్ల సాయంత్రం యాపిల్ పండును తినరాదు. అంతగా తినదలిస్తే సాయంత్రం 6 లోపే ఆ పండ్లను తినాలి. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. నిద్ర సరిగ్గా పట్టదు.
యాపిల్ పండ్లలో పెక్టిన్ ఉంటుంది. ఇది పెద్ద పేగులో ఆరోగ్యకరమైన బాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ ప్రయోజనాలను పొందాలంటే యాపిల్ పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేశాక ఒక గంట ఆగి తింటే మంచిది. ముఖ్యంగా యాపిల్ పండ్లను పొట్టుతోనే తినాలి. ఇది మరిచిపోకండి. ఎందుకంటే పొట్టులో అనేక పోషకాలు ఉంటాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram