Trump’s 25% tariff warning: యాపిల్ కు ట్రంప్ వార్నింగ్

Trump’s 25% tariff warning:  యాపిల్ కు ట్రంప్ వార్నింగ్

– ఐఫోన్లు అమెరికాలోనే తయారుచేయాలని హుకుం
– లేదంటే 25 శాతం సుంకం వేస్తామంటూ హెచ్చరిక

Trump’s 25% tariff warning: ఐఫోన్ల తయారీకి సంబంధించి మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాపిల్ సంస్థకు వార్నింగ్ ఇచ్చాడు. ఐఫోన్ల విడిభాగాలు కచ్చితంగా అమెరికాలో తయారుచేయాలని హుకుం జారీ చేశారు. అలా కాకుండా భారత్ సహా ఇతర దేశాల్లో తయారు చేస్తే యాపిల్ కంపెనీకి 25 శాతం సుంకం విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యం ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశాడు. ఈ విషయం ఇప్పటికే యాపిల్ సీఈవో టిమ్ హుక్ కు స్పష్టం చేసినట్టు ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా యాపిల్ విలువ పతనమైనట్టు సమాచారం. చైనా, అమెరికా దేశాల్లో తయారు చేస్తే సుంకం ఎక్కువ పడుతుందన్న కారణంతో యాపిల్ ఇండియాకు వచ్చింది.

అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి వార్నింగ్ తో యాపిల్ సంస్థ వెనక్కి తగ్గబోతున్నదా? అన్నది వేచి చూడాలి. ఇక ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వివిధ దేశాలను భయపెడుతున్నారు.