Plane | 3 నిమిషాల్లోనే 15 వేల అడుగుల కింద‌కు విమానం.. అస‌లేం జ‌రిగిందంటే..?

Plane | అమెరికాలో ఓ విమానం ఊహించ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంది. అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్ విమానం కేవ‌లం 3 నిమిషాల వ్య‌వ‌ధిలోనే 15 వేల అడుగులు కింద‌కు దిగింది. దీంతో విమానంలోని ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ఊపిరి బిగ‌ప‌ట్టుకున్నారు. చివ‌ర‌కు విమానం సుర‌క్షితంగా ల్యాండ్ కావ‌డంతో ప్ర‌యాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో పీడ‌నానికి సంబంధించిన స‌మ‌స్య త‌లెత్త‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని విమాన‌యాన సంస్థ స్ప‌ష్టం చేసింది. అస‌లేం జ‌రిగిందంటే..? అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్‌కు […]

  • Publish Date - August 13, 2023 / 01:56 PM IST

Plane |

అమెరికాలో ఓ విమానం ఊహించ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంది. అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్ విమానం కేవ‌లం 3 నిమిషాల వ్య‌వ‌ధిలోనే 15 వేల అడుగులు కింద‌కు దిగింది. దీంతో విమానంలోని ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ఊపిరి బిగ‌ప‌ట్టుకున్నారు. చివ‌ర‌కు విమానం సుర‌క్షితంగా ల్యాండ్ కావ‌డంతో ప్ర‌యాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో పీడ‌నానికి సంబంధించిన స‌మ‌స్య త‌లెత్త‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని విమాన‌యాన సంస్థ స్ప‌ష్టం చేసింది.

అస‌లేం జ‌రిగిందంటే..?

అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఉత్త‌ర క‌రోలినాలోని షార్లెట్ నుంచి ఫ్లోరిడాలోని గెయిన్జ్‌ విల్‌కు టేకాఫ్ తీసుకుంది. అయితే మార్గ‌మ‌ధ్య‌లో 29 వేల అడుగుల ఎత్తులో ఉండ‌గా విమానంలో పీడ‌న స‌మ‌స్య త‌లెత్తింది. దీన్ని సిబ్బంది గుర్తించారు. వెంట‌నే మాస్కుల ద్వారా ప్ర‌యాణికుల‌కు ఆక్సిజ‌న్ అంద‌జేశారు.

దీంతో విమానాన్ని వీలైనంత త్వ‌ర‌గా కింద‌కు దించి, త‌క్కువ ఎత్తులో న‌డ‌పాల‌ని పైల‌ట్లు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో విమానాన్ని కేవ‌లం 6 నిమిషాల్లోపే 18,600 అడుగుల కింద‌కు దించారు. ఈ సంద‌ర్భంగా విమానంలో ప్ర‌యాణించిన ఫ్లోరిడా యూనివ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ హ‌రిస‌న్ హోవ్ త‌న అనుభ‌వాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకుకున్నారు. తాను చాలా సార్లు విమానంలో ప్ర‌యాణించాను. కానీ ఇది భ‌యాన‌క అనుభ‌వంఅని పేర్కొన్నారు.

Latest News