Sunita Williams | స్పేస్‌ స్టేషన్‌కు చేరుకోగానే సునీతా విలియమ్స్‌ డ్యాన్స్‌.. Video viral

Sunita Williams | భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita williams) ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమెతోపాటు అమెరికా వ్యోమగామి బుచ్ విల్మెర్ (Butch Wilmore) కూడా అంతరిక్షంలోకి వెళ్లారు. వారిద్దరిని తీసుకెళ్లిన స్టారైనర్ వ్యోమనౌక గత రాత్రి స్పేస్ స్టేషన్‌తో అనుసంధానమైంది.

Sunita Williams : భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita williams) ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమెతోపాటు అమెరికా వ్యోమగామి బుచ్ విల్మెర్ (Butch Wilmore) కూడా అంతరిక్షంలోకి వెళ్లారు. వారిద్దరిని తీసుకెళ్లిన స్టారైనర్ వ్యోమనౌక గత రాత్రి స్పేస్ స్టేషన్‌తో అనుసంధానమైంది. ఈ క్యాప్సుల్‌ను బోయింగ్ కంపెనీ రూపొందించింది. ఇదే దాని మొదటి మానవ సహిత యాత్రగా నిలిచింది.

స్పేస్ స్టేషన్‌లోకి చేరుకోగానే సునీతా విలియమ్స్ డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. స్పేస్‌ స్టేషన్‌లోని వ్యోమగాములను తన మరో కుటుంబంగా ఆమె వర్ణించారు. తనకు స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి 71 మంది వ్యోమగాములను ఆమె కలిశారు.

కాగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మెర్ స్పేస్ స్టేషన్ చేరుకోకముందు హీలియం లీకేజీ వల్ల వ్యోమనౌకలోని థ్రస్టర్లలో సమస్యలు వచ్చాయి. అయినప్పటికీ అది అనుసంధానం కావడం గమనార్హం. దక్షిణ హిందూ మహాసముద్రానికి పైన 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ స్పేస్ స్టేషన్ ఉంది. ఈ నెల 14న సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మెర్‌ భూమిపైకి తిరిగిరానున్నారు.

Latest News