Nasa | Sunita Williams | Butch Wilmore
స్పేస్ ఎక్స్ సంస్థకు డ్రాగన్ క్యాప్య్సూల్ ద్వారా సునీతా విలియమ్స్ (Sunita Williams ), బుచ్ విల్మోర్ (Butch Wilmore) సహా మరో ఇద్దరు వ్యోమగాములున్న క్రూ9 టీమ్ తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. పారాచూట్ల సాయంతో సముద్రజలాల్లోకి అంతరిక్షం నుంచి దిగిన డ్రాగన్ క్యాప్సూల్ ను స్పేస్ ఎక్స్, నాసా సంస్థలకు చెందిన సహాయక బృందాలు రెస్క్యూ చేశాయి.
స్పేస్ ఎక్స్ సంస్థ కు చెందిన ఓ పెద్ద రికవరీ బోటు డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండ్ అయిన చోటుకు రాగా దాంట్లో ఉండే టెక్నీషియన్స్ డ్రాగన్ క్యాప్సూల్ కు రోప్స్ కట్టి దాన్ని అతి జాగ్రత్తగా రికవరీ బోట్ లోకి ఎక్కించారు. గత ఏడాది జూన్‌లో వీరు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిఫ్‌లో సమస్యలు తలెత్తడంతో అక్కడే ఉండిపోయారు.
8 రోజుల పర్యటన అని వెళ్లిన వారు 286 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. తిరిగి భూమి మీదకు రావడానికి 9 నెలల పాటు అంతరిక్షంలో వేచి చూడాల్సి వచ్చింది. భూమి మీదకు దిగిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడే మరో నెలన్నర పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. అనంతరం ఇంటికి వెళతారు.