విధాత వైరల్ డెస్క్ | హైదరాబాద్:
ప్రకృతి అందాలు చూడతరమా అనిపించేలా..పర్వతగిరుల్లో కనిపించిన పక్షుల చెట్టు అద్బుతాన్ని ఆవిష్కరించింది. కొండ శిఖరాలపై చెట్టు కొమ్మల ఆకులను తలపించేలా పక్షుల సమూహం కొలువుతీరిన దృశ్యం కనువిందుకాక మానదు. అందులో ఆ పక్షలు కిలకిల రావాలు..మధుర గానాల మాదిరిగా మమైరిపించడం మరింత మానసిక ఆహ్లాదాన్ని అందిస్తుందనడంతో అతిశయోక్తి లేదు.
అనమలై టైగర్ రిజర్వ్ అభయారణ్యంలోని పర్వత గిరుల్లో వేలా వేలాది చెస్ట్నట్-హెడెడ్ బీ-ఈటర్ పక్షుల జాతులు సాయంత్రం గూటికి చేరేముందు గుంపులుగా విహరిస్తూ..ఆకాశాన్ని రంగులతో కమ్మెసినట్లుగా కనువిందు చేస్తుంటాయి. ఇదే క్రమంలో ఓ పర్వతగిరిపైన చెట్టుకొమ్మపై వాలిన చెస్ట్నట్-హెడెడ్ బీ-ఈటర్ పక్షులు ఆ కొమ్మకు ఆకుల మాదిరిగా ఒదిగిపోయాయి. ఆ సుందర దృశ్యాన్ని అటవీ శాఖ అధికారి సుప్రియ సాహు ఎక్స్ లో పంచుకున్నారు.
రంగురంగుల ఆకులా? కిలకిలారావాల పక్షులా?
ఆకుల్లా కనిపించే గుంపులోని అసలు పక్షి… రంగురంగుల చెస్ట్నట్-హెడెడ్ బీ-ఈటర్
ఇదే ఆ “ఆకుల్లా కనిపించిన” పక్షి 👇
చెస్ట్నట్-హెడెడ్ బీ-ఈటర్
🎨 రంగుల మ్యాజిక్
-
🔴 తలపై గోధుమ-ఎరుపు (Chestnut)
-
🟡 మెడ దగ్గర పసుపు షేడ్
-
🟢 శరీరం మొత్తం ఆకుపచ్చ
-
🔵 తోకలో నీలం టోన్
వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీరామ్ పి. మురళి చిత్రీకరించిన ఈ వీడియోలో, ‘చెస్ట్నట్-హెడెడ్ బీ-ఈటర్స్’ అనే పక్షులు వేల సంఖ్యలో ఒకేసారి ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. వాటి చిలిపి చిలిపి కిలకిలారావాలు ఒక అద్భుతమైన సంగీత విందులా అనిపించాయి.అన్నామలై అడవుల్లో కనిపించిన ఈ అద్భుత దృశ్యంలో, చెట్టు కొమ్మలపై వరుసగా కూర్చున్న ‘చెస్ట్నట్-హెడెడ్ బీ-ఈటర్స్’ పక్షులు, దూరం నుంచి చూస్తే ఆకుల్లా కనిపిస్తున్నాయి. దగ్గరగా చూస్తే మాత్రం వాటి రంగులు, కదలికలు ఒక అద్భుతమైన “బర్డ్ ఆర్కెస్ట్రా”లా మారిపోతాయి.
సుప్రియా సాహు తన పోస్ట్‌లో “ఇది నిజమైన బర్డ్ ఆర్కెస్ట్రా. ఈ పక్షులు భద్రత కోసం గుంపులుగా కదులుతాయి. పరస్పరం శబ్దాల ద్వారా కనెక్ట్ అవుతూ, కలిసి వేటాడుతాయి. ఇవి కీటకాలను నియంత్రించి పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని వివరించారు.
Bird orchestra at its finest! 🎶
And hidden in this chatter is a beautiful life lesson. 🙌At the foothills of the Anamalai Tiger Reserve, thousands of Chestnut-headed Bee-eaters paint the sky before coming together to roost. They gather for safety, stay connected through… pic.twitter.com/Y0edcu8XZK
— Supriya Sahu IAS (@supriyasahuias) March 18, 2026
అడవుల అంచుల వెంబడి, పర్వత ప్రాంతాల్లో, మైదానాల్లో కనిపించే ఈ ఉత్సాహభరితమైన పక్షులు, కీటకాల జనాభాను నియంత్రించడం ద్వారా ముఖ్యమైన పర్యావరణ పాత్రను కూడా పోషిస్తాయని, సమూహంగా సంచరిస్తూ.. ఐకమత్యంలోనే బలం ఉందని చాటడంతో పాటు తమ రాగాలతో అద్బుత గానామృతాన్ని పంచుతాయని పేర్కొనడం విశేషం.
ఇవి కూడా చదవండి :
Nellore : కూల్ డ్రింక్స్ లారీ బోల్తా…10నిమిషాల్లో ఖాళీ చేసిన జనం
Droupadi Murmu Visits Ayodhya : అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
