విధాత : మృతేదేహాన్ని తరలించేందుకు బయలుదేరిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి కుప్పకూలిన ఘటన వీడియో వైరల్ గా మారింది. మృతదేహంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ తూర్పు నేపాల్ ఖోటాంగ్ జిల్లాలోని బేలాబీసీ గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ తొలుత ల్యాండ్ అయినట్టే అనిపించినా.. విపరీతమైన దూళి వల్ల అదుపు తప్పి క్రాష్ ల్యాండింగ్ అయ్యింది.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఖట్మాండు నుంచి ఒక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హెలికాప్టర్‌లో తరలిస్తున్నారు. ఖోటాంగ్ జిల్లా కెపిలాస్‌గఢిలో హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ప్రమాద సమయంలో పైలట్, నలుగురు ప్యాసింజర్లు హెలికాప్టర్ లో ఉన్నారు. ప్రమాదంలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని జిల్లా మేజిస్ట్రేట్ రేఖా కండెల్ మీడియాకు తెలిపారు. గాయపడిన ప్రయాణికుడిని చికిత్సకోసం మరో హెలికాప్టర్ ఖట్మండ్ కు తరలించారు. ల్యాండింగ్ సమయంలో వీచిన బలమైన గాలులు, దుమ్ము పేరుకుపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
రోడ్డు, విమానాశ్రయ సౌకర్యాలు పరిమితంగా ఉండే నేపాల్ పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ ప్రయాణాలు సాధారణంగా కొనసాగుతుంటాయి. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు హెలికాప్టర్‌లో వెలుతున్న క్రమంలో ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్‌ను నడపడం అత్యంత ప్రమాదకరం. ఇరుకైన లోయలు, ఆకస్మిక వాతావరణ మార్పులు, తాత్కాలిక ల్యాండింగ్ ప్రదేశాలు పైలట్లకు తీవ్రమైన సవాళ్లను విసురుతాయి. ఈ కారణంగానే నేపాల్‌లో హెలికాప్టర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.
అయితే తాజా ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ప్రస్తుతం తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం సాంకేతిక లోపమా? లేదంటే పైలట్ తప్పిదమా? వాతావరణం మార్పులు కారణమా? అనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సహాయక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను పరిశీలించారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ‘ఎయిర్ డైనస్టీ’కి చెందినదిగా తెలుస్తోంది.
🚨DRAMATIC VIDEO OF HELICOPTER CRASH IN NEPAL
A helicopter crashed in Khotang District of Nepal, while landing in the farmland.
The helicopter was carrying a body and had flown in from Kathmandu. No human casualties has been recorded. #nepal #planecrash #breaking pic.twitter.com/IxTQ3pJSA4
— Chaudhary Parvez (@ChaudharyParvez) March 18, 2026
ఇవి కూడా చదవండి :
MLA Raja Singh | ఇదే నీ ఆఖరి శ్రీరామ నవమి: ఎమ్మెల్యే రాజాసింగ్ కి బెదిరింపులు
Actress | భర్త-తల్లి అక్రమ సంబంధం… టాక్ షోలో తైవాన్ నటి జియాంగ్ పింగ్ షాకింగ్ విషయాలు వెల్లడి
