MLA Raja Singh | ఇదే నీ ఆఖరి శ్రీరామ నవమి: ఎమ్మెల్యే రాజాసింగ్ కి బెదిరింపులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఇదే నీ చివరి శ్రీరామ నవమి అంటూ హెచ్చరించడంతో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Mar 18, 2026, 4:19 pm IST
Read Time: 3 mins
MLA Raja Singh | ఇదే నీ ఆఖరి శ్రీరామ నవమి: ఎమ్మెల్యే రాజాసింగ్ కి బెదిరింపులు

విధాత : గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇదే నీ ఆఖరి శ్రీరామ నవమి అంటూ అగంతకులు లేఖలో రాజాసింగ్ ను హెచ్చరించారు.

నిన్ను అంతమొందించేందుకు మూడు టీమ్ లను రంగంలోకి దించామని, మరో రెండు చోట్ల బాంబ్ బ్లాస్టింగ్ కు ప్లాన చేశామని ఆ లేఖలో హెచ్చరించారు. తనకు వచ్చిన బెదిరింపు లేఖను స్వయంగా రాజాసింగ్ వెల్లడించారు. తాను శ్రీరామనవమి ఉత్సవ సన్నాహాల్లో బిజీగా ఉన్న సమయంలో తనకు వచ్చిన లేఖను తెరిచి చూస్తే అందులో బెదిరింపులు ఉన్నాయని తెలిపారు.

బెదిరింపు లేఖ విషయాన్ని తాను పోలీసుల దృష్టికి తీసుకెళ్లే ..ఇలాంటివి సాధారణమే అని, మీకు ఏం కాదు అని తేలిగ్గా చెప్పారని రాజాసింగ్ వెల్లడించారు. రాజాసింగ్ ఖతమైతే మేం టెన్షన్ ఫ్రీగా ఉండవచ్చని పోలీసుల భావిస్తున్నారని ఆరోపించారు. చావు ఏదో ఒక రోజు తప్పదని, నేను వెళ్లిపోతే నా తర్వాతా మీరంతా హిందూ ధర్మ పరిరక్షణకు పోరాడాలని కార్యకర్తలకు రాజాసింగ్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి :

US Self Deportation Offer : అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్ !
Nayantara | నాకు నయనతార కావాలంటూ ఎంపీ ఘాటు వ్యాఖ్య‌లు… ఖుష్బూ, నడిగర సంఘం తీవ్ర ఆగ్రహం