Actress | భర్త-తల్లి అక్రమ సంబంధం… టాక్ షోలో తైవాన్ నటి జియాంగ్ పింగ్ షాకింగ్ విషయాలు వెల్లడి

Actress | తైవాన్‌కు చెందిన నటి జియాంగ్ పింగ్ తన జీవితంలో ఎదురైన అత్యంత బాధాకరమైన సంఘటనను ఇటీవల ఒక టాక్ షోలో వెల్లడించింది. తన భర్త ఏకంగా తన కన్నతల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి జీవితంలో పెద్ద షాక్ ఎదురైందని ఆమె కన్నీళ్లతో వివరించింది

  • By: Sandeep |    movies |    Published on : Mar 18, 2026 4:35 PM IST
Actress | భర్త-తల్లి అక్రమ సంబంధం… టాక్ షోలో తైవాన్ నటి జియాంగ్ పింగ్ షాకింగ్  విషయాలు వెల్లడి

Actress | తైవాన్‌కు చెందిన నటి జియాంగ్ పింగ్ తన జీవితంలో ఎదురైన అత్యంత బాధాకరమైన సంఘటనను ఇటీవల ఒక టాక్ షోలో వెల్లడించింది. తన భర్త ఏకంగా తన కన్నతల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి జీవితంలో పెద్ద షాక్ ఎదురైందని ఆమె కన్నీళ్లతో వివరించింది. ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ జియాంగ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

జియాంగ్ పింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె 21 ఏళ్ల వయసులో తనకంటే 12 ఏళ్లు పెద్దవాడిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత మొదటి ఐదేళ్లు వారి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. అయితే తర్వాత నుంచి వారి సంబంధంలో సమస్యలు మొదలయ్యాయి. ఏడో సంవత్సరం నాటికి తన భర్త ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని ఆమె పేర్కొన్నారు.

నాపై నా భ‌ర్త‌కి ఆస‌క్తి త‌గ్గింది..

తనపై భర్త ఆసక్తి తగ్గిపోయి తరచూ మాటలతో అవమానించడం ప్రారంభించాడని జియాంగ్ చెప్పారు. ఒక రోజు అనుమానం వచ్చి భర్తను నిలదీయగా అతను చెప్పిన మాటలు తనను తీవ్రంగా షాక్‌కు గురిచేశాయని తెలిపారు. “నేను మీ ఇద్దరినీ ఒకేసారి చూసుకోగలను” అని అతను చెప్పడంతో ఆమె మైండ్ బ్లాక్ అయ్యిందని వెల్లడించారు.

ఈ మాటలతో అనుమానం వచ్చిన జియాంగ్ వెంటనే తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. అక్కడ తన తల్లి ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా కనిపించిందని ఆమె చెప్పారు. తలుపు తెరిచి కూతురిని చూసిన వెంటనే తిరిగి లోపలికి వెళ్లి తలుపు వేసుకోవడంతో ఏదో తప్పు జరుగుతోందని అప్పుడే తనకు అర్థమైందని తెలిపారు.

ప‌రిచ‌యం అక్ర‌మ సంబంధంగా..

తర్వాత జరిగిన విషయాలను జియాంగ్ మరింత బాధతో వెల్లడించారు. తన తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో మసాజ్ చేయడం తెలుసని చెప్పిన తన భర్త ఆమెకు సహాయం చేయడం ప్రారంభించాడని చెప్పారు. ఆ పరిచయం క్రమంగా వారిద్దరి మధ్య అక్రమ సంబంధంగా మారిందని ఆమె ఆరోపించారు.

ఈ విషయం తెలిసిన తర్వాత తీవ్ర ఆవేదనకు గురైన జియాంగ్ వెంటనే తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాకుండా తన తల్లితో కూడా సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటన తన జీవితంలో చాలా బాధాకరమైన అనుభవమని ఆమె పేర్కొన్నారు. జియాంగ్ చేసిన ఈ షాకింగ్ వెల్లడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతూ, ఆమెకు జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.