Divya Sathyaraj | వివాహం చేసుకోకుండానే అమ్మ‌తనం సాధ్యం .. దివ్య వ్యాఖ్యలపై చర్చ, తండ్రి సత్యరాజ్ మద్దతు

Divya Sathyaraj | భారతీయ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటుడు సత్యరాజ్ కుమార్తె, న్యూట్రిషనిస్ట్ మరియు డీఎంకే నాయకురాలు దివ్య సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. వివాహం లేకుండానే పిల్లల్ని కనవచ్చని, తాను కూడా ఆ ఆలోచనకు సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించడం వివాదాస్పదంగా మారింది.

Reported by: Sandeep | సినిమా | Apr 29, 2026, 11:57 am IST
Read Time: 4 mins
Divya Sathyaraj | వివాహం చేసుకోకుండానే అమ్మ‌తనం సాధ్యం .. దివ్య వ్యాఖ్యలపై చర్చ, తండ్రి సత్యరాజ్ మద్దతు

Divya Sathyaraj | భారతీయ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటుడు సత్యరాజ్ కుమార్తె, న్యూట్రిషనిస్ట్ మరియు డీఎంకే నాయకురాలు దివ్య సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. వివాహం లేకుండానే పిల్లల్ని కనవచ్చని, తాను కూడా ఆ ఆలోచనకు సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించడం వివాదాస్పదంగా మారింది.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దివ్య, వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి సంప్రదాయాల కంటే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. సహజీవనం చేసే వారు తప్పనిసరిగా ఒకే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని, వేర్వేరు ఇళ్లలో ఉంటూ కూడా సంబంధాన్ని కొనసాగించవచ్చని ఆమె చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది.

భిన్న స్పంద‌న‌లు..

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు దివ్యను ఆధునిక ఆలోచనలు కలిగిన మహిళగా అభినందిస్తుండగా, మరికొందరు ఆమె అభిప్రాయాలను విమర్శిస్తున్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ, సంప్రదాయ విలువలకు ఇది విరుద్ధమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి విమర్శల మధ్య తండ్రి సత్యరాజ్ తన కుమార్తెకు బలమైన మద్దతుగా నిలిచారు. తాను పెరియార్ సిద్ధాంతాలను విశ్వసిస్తానని, కులమతాలు మరియు మూఢనమ్మకాలకు వ్యతిరేకమని చెప్పారు. వివాహం ఒక వ్యక్తిగత ఎంపిక మాత్రమేనని, ఆధునిక వైద్య సాంకేతికతలతో పెళ్లి లేకుండానే సంతానం పొందే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తన కుమార్తె ఆలోచనలను గౌరవిస్తున్నానని వెల్లడించారు.

గ‌తంలోను కొంద‌రు మ‌హిళ‌లు కూడా..

దివ్య కూడా తన తండ్రి ఎప్పుడూ తన నిర్ణయాలను గౌరవించారని, తన సంతోషమే ఆయనకు ముఖ్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు సామాజికంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

ఇదిలా ఉండగా, గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు వివాహం లేకుండానే తల్లితనం స్వీకరించారు. సుస్మితా సేన్ ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. అలాగే నీనా గుప్తా పెళ్లి కాకుండానే కుమార్తెకు జన్మనిచ్చి విమర్శలను ఎదుర్కొన్నారు.

దివ్య సత్యరాజ్ వ్యాఖ్యలు సమాజంలో వివాహం, కుటుంబ వ్యవస్థపై కొత్త చర్చకు తెరలేపగా, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆధునిక ఆలోచనల మధ్య సమతుల్యతపై భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.