కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో (Justin Trudeau) ప్రేమ వ్యవహారం మరోసారి చర్చకు దారితీస్తోంది. భార్యతో విడాకుల అనంతరం ట్రూడో మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన గ్లోబల్ పాప్ స్టార్ కేటీ పెర్రీ (Katy Perry)తో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రూమర్స్‌కు బలం చేకూరుస్తూ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. కలిసి డిన్నర్ డేట్ (dinner date)కు వెళ్తున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి జపాన్‌లో విహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దావోస్‌లో ఈ జంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా వీరి ప్రేమ వ్యవహారం మరోసారి బట్టబయలైంది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని స్పష్టం చేసే కొన్ని దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. సదస్సులో భాగంగా జరిగిన ‘గ్లోబల్ సాఫ్ట్ పవర్ సమ్మిట్’లో జస్టిన్ ట్రూడో ప్రసంగిస్తుండగా.. కేటీ పెర్రీ అనూహ్యంగా ‘ఫీమేల్ కోషెంట్ లాంజ్’లోకి ప్రవేశించింది. అక్కడ కూర్చున్న కేటీపెర్రీని చూసిన ట్రూడో.. నవ్వుతూ కన్నుగీటారు. దానికి ప్రతిగా ఆమె కూడా నవ్వుతూనే తల ఊపుతూ ట్రూడోకు సైగ చేశారు. ఈ దృష్యాలు అక్కడి కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వీరి ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
మొదటి భార్యతో విడాకులు..
కాగా, జస్టిన్ ట్రూడో 2023లో తన భార్య సోఫీ గ్రెగోయ్‌రీ (Sophie Gregoire)తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 18 ఏండ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చింకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించారు. 2005, మే నెలలో జస్టిన్ ట్రుడో, సోఫీ గ్రెగోయ్‌రీ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం విడిపోతున్నప్పటికీ వారి సంరక్షణను తామిద్దరం కలిసే చూసుంటామని ట్రుడో దంపతులు వెల్లడించారు. ఎప్పటిలాగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని తెలిపారు. మరోవైపు జనవరి 2025లో ప్రధానమంత్రి పదవికి ట్రూడో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బయట ప్రపంచానికి చాలా తక్కువగా కనిపిస్తున్నారు.
కాగా, కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతేడాది జనవరి 6న ప్రకటించారు. తన నాయకత్వంపై లిబరల్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అసంతృప్తి పెరిగిపోతుండటంతో అర్ధంతరంగా ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు.
passing the signals to each other in middle of conference.. oh they are in LOVE😭 pic.twitter.com/vREWX8lWPX
— kanishk (@kaxishk) January 21, 2026
ఇవి కూడా చదవండి :
Khawaja Asif | పిజా హట్ ఓపెన్ చేసి నవ్వులపాలైన పాక్ మంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
12 Lane Greenfield Expressway | ఫ్యూచర్ సిటీ టు అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్ హైవే ఈ ఊళ్లమీదుగా వెళ్తుందా?
