Kenya Plane Crash : కెన్యాలో ఘోర విమాన ప్రమాదం..12మంది మృతి

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం. డయాని నుండి మాసాయి మారా వెళ్తున్న విమానం కూలి 12మంది పర్యాటకులు మృతి చెందారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Kenya Plane Crash

న్యూఢిల్లీ : కెన్యాలోని క్వాలే కౌంటీలో టూరిస్టులతో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయి 12మంది మృతిచెందారు.
12మంది పర్యాటకులతో డయాని నుండి మాసాయి మారా వెళ్తున్న ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయిందని కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారులు సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విమానం ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన మాసాయి మారా నేషనల్ రిజర్వ్ వైపు వెళ్తోంది. డయానీ ఎయిర్‌స్ట్రిప్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ ప్రాంతం, దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మాసాయి మారా నేషనల్ రిజర్వ్ ఫారెస్టు ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఉంది. ఇక్కడ టాంజానియాలోని సెరెంగెటి నుంచి ఏటా జరిగే జింకల వలస ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.