Red Lipstick | ఉత్తర కొరియాలో రెడ్‌ లిప్‌స్టిక్‌ను బ్యాన్‌ చేసిన కిమ్‌మామా..! ఈ నిషేధం ఎందుకో తెలుసా..?

Red Lipstick | ఉత్తర కొరియా పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌. ఇప్పటికే ఎన్నో విచిత్రమైన ఆంక్షలు ఉత్తర కొరియాలో అమలులో ఉన్నాయి. ఆంక్షలను ఉల్లంఘించిన వారికి శిక్షలు విధించిన సందర్భాలున్నాయి. ఇక్కడ అమలయ్యే కఠిన చట్టాలు, నిబంధనలు దశాబ్దాలుగా కొనసాగుతున్నా.. కిమ్‌ పాలనలో మరింత పెరిగాయి.

  • Publish Date - May 14, 2024 / 10:10 AM IST

Red Lipstick | ఉత్తర కొరియా పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌. ఇప్పటికే ఎన్నో విచిత్రమైన ఆంక్షలు ఉత్తర కొరియాలో అమలులో ఉన్నాయి. ఆంక్షలను ఉల్లంఘించిన వారికి శిక్షలు విధించిన సందర్భాలున్నాయి. ఇక్కడ అమలయ్యే కఠిన చట్టాలు, నిబంధనలు దశాబ్దాలుగా కొనసాగుతున్నా.. కిమ్‌ పాలనలో మరింత పెరిగాయి. తాజాగా ఉత్తర కొరియాలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వాడకాన్ని నిషేధించారు. సాధారణంగా రెడ్‌కలర్‌ కమ్యూనిజానికి చిహ్నం నిలుస్తుంది. చరిత్రలో ఆ రంగుకు, కమ్యూనిస్టులకు విడదీయరాని సంబంధాలే ఉన్నాయి.

కానీ, కమ్యూనిస్టు భావాలుగల ఉత్తర కొరియాకు మాత్రం రెడ్ లిప్‌స్టిక్ పెట్టుబడిదారీ వ్యవస్థకు సంకేతమని.. మహిళలు ఎర్ర రంగు లిప్ స్టిక్ వేసుకుంటే వారు మగవారిని మరింత ఎక్కువగా ఆకర్షిస్తారని కిమ్ ప్రభుత్వం తేల్చింది. దేశ ప్రజలు హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా జీవించాలన్న ప్రభుత్వ వైఖరికి ఇది విరుద్ధమని సూత్రీకరిస్తూ.. రెడ్ లిప్‌స్టిక్ వాడకంపై బ్యాన్‌ విధించింది. అయితే, మగువల మేకప్‌పై ఇప్పటికే కిమ్‌ సర్కారు గతంలోనే కన్నెర్ర చేసింది. పశ్చిమ దేశాల వేషధారణ, ఫ్యాషన్‌ ప్రభావం ఉండకూడదని నిర్ణయించింది.

ఈ క్రమంలో ఉత్తర కొరియాలో ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్‌, కాస్మోటిక్‌ బ్రాండ్లపై ఉత్తర కొరియాలో ఇప్పటికే నిషేధం కొనసాగుతోంది. కొన్నేళ్ల కిందట స్కిన్ ఫిట్ జీన్స్, టాటూలు, ఆడ, మగవారికి కొన్ని రకాల హెయిర్ స్టయిల్స్‌ను సైతం నిషేధించాడు. ముఖ్యంగా కిమ్ హెయిర్ స్టయిల్‌ని ఎవరూ కాపీ కొట్టకూడదంటూ మగవారిపై నిషేధం విధించింది. అలాగే, అధ్యక్షుడు ధరించే నల్లకోటును పోలిన కోటును ఎవరూ ధరించకూడదని తీర్మానించింది. నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రత్యేకంగా పోలీసులను సైతం నియమించింది. దీన్ని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు, శిక్షలు సైతం విధిస్తూ వస్తున్నారు.

Latest News