Site icon vidhaatha

Kim | యుద్ధం అనివార్యం.. స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉండండి! సైన్యానికి పిలుపునిచ్చిన కిమ్‌

Kim |

ఉత్త‌ర కొరియా (North Korea) కిమ్ జాంగ్ ఉన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. యుద్ధం (War) అనివార్య‌మ‌ని.. త‌క్ష‌ణం స‌ర్వ స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని సైన్యానికి పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలో ఆర్మీ జ‌న‌ర‌ల్‌ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించారు. ఆయుధాల ఉత్ప‌త్తి, మాక్ డ్రిల్స్, యుద్ధ విన్యాసాల‌ను విరివిగా చేప‌ట్టాల‌ని సైన్యానికి ఆదేశించారు.

ఉత్త‌ర‌కొరియా శ‌త్రువుల‌ను ఎలా ఎదుర్కోవాల‌నే అంశంపై ఆ దేశ సెంట్ర‌ల్ మిల‌ట‌రీ క‌మిష‌న్ స‌మావేశ‌మైంది. ఇందులో పాల్గొన్న కిమ్‌.. యుద్ధం త‌ప్ప‌నిస‌ర‌ని వ్యాఖ్యానించిన‌ట్లు తెలిసింది. కార‌ణాలేమీ పేర్కొన‌కుండా ఆర్మీ జ‌న‌ర‌ల్ రియ్ యాంగ్ గిల్‌ను త‌ప్పిస్తున్న‌ట్లు ఆ దేశ సైన్యం ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా ఉత్త‌ర కొరియా విడుద‌ల చేసిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో కిమ్.. ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్‌, దాని చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌ను వేలితో చూపిస్తున్న ఫొటోను ప్ర‌చురించింది.

మ‌రోవైపు ఈ నెల 21 నుంచి 24 వ‌ర‌కు అమెరికా, ద‌క్షిణ కొరియాలు భారీ సైనిక విన్యాసాలు నిర్వ‌హించ‌ నున్న నేప‌థ్యంలో వాటిని ఉత్త‌ర‌కొరియా త‌న భ‌ద్ర‌త‌కు ప్ర‌మాద‌క‌రంగా ప‌రిగ‌ణిస్తోంది. అంతేకాకుండా త‌మ రాజ్యం ఏర్ప‌డి సెప్టెంబ‌రు 9కి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా భారీ మిల‌ట‌రీ క‌వాతును నిర్వ‌హించేం దుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

Exit mobile version