Site icon vidhaatha

Linda Inez Leccese | ఓ సెక్స్‌ వర్కర్‌ అమానుషం.. ఎయిడ్స్ ఉందని తెలిసీ 211 మందితో శృంగారం..!

Linda Inez Leccese : అగ్రరాజ్యం అమెరికాలో ఓ సెక్స్‌ వర్కర్‌ అమానుషంగా వ్యవహరించింది. అమె వ్యవహరించిన తీరు వందల మంది జీవితాలను ప్రమాదంలో పడేసింది. తనకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తెలిసినా ఆమె అనేక మందితో లైంగికంగా కలిసింది. ఈ విషయం బయటికి రావడంతో ఆమెను కలిసిన వాళ్లు భయంతో వణికిపోతున్నారు.

అధికారులు విషయం తెలుసుకుని కంగుతున్నారు. స్థానికులను అప్రమత్తం చేశారు. ఆమెతో శృంగారంలో పాల్గొన్న వారు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ ఒక హెల్త్‌ అలర్ట్‌ జారీచేశారు. అనంతరం సదరు మహిళను అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.

ఒహైయోలోని మరియెట్టాకు చెందిన లిండా ఇనేజ్‌ లెచెసే ఓ సెక్స్‌ వర్కర్‌. అక్కడి మార్కెట్‌ వీధిలో అనేక మందిని ఆకర్షిస్తుండేది. ఇలా 2022 జనవరి నుంచి ఇప్పటివరకు అనేక మందితో లైంగిక సంబంధం కొనసాగించింది. ఆమె హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ ఈ అమానుషానికి పాల్పడింది. యథేచ్ఛగా తన కార్యకలాపాలను కొనసాగించింది.

గడిచిన రెండున్నరేళ్లలో లిండా 211 మందితో శృంగారంలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. లిండా చర్యలతో అప్రమత్తమైన అధికారులు.. పబ్లిక్‌ హెల్త్‌ నోటీసులు జారీచేశారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆమె క్లయింట్లకు వ్యక్తిగతంగా ఫోన్లు చేశారు.

Exit mobile version