USA Crime News : అమెరికాలో భార్య సహా ముగ్గురి బంధువుల హత్య !

అమెరికాలో భారత కుటుంబంలో కలహాలు కాల్పులకు దారితీశాయి. భర్త కాల్పుల్లో భార్యతో పాటు ముగ్గురు బంధువులు మృతి చెందారు.

విధాత: అమెరికాలో నివసిస్తున్న భారత కుటుంబంలో నెలకొన్న కలహాలు కాల్పులకు దారితీశాయి. భర్త జరిపిన కాల్పుల్లో భార్య సహా, అతని ముగ్గురు బంధువులు హతమయ్యారు. జార్జియాలోని లారెన్స్‌విల్లే నగరంలో శుక్రవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన ఈ ఘటనలో నిందితుడు విజయ్ కుమార్ (51)ను పోలీసులు అరెస్టు చేశారు. మృతులను విజయ్ కుమార్ భార్య మీను డోగ్రా (43), బంధువులు గౌరవ్ కుమార్‌ (33), నిధి చందర్ (33), హరీష్‌ చందర్(38)గా గుర్తించారు. ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఈ కాల్పుల ఘటన సమాచారం ఫోన్ కాల్ ద్వారా అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోగానే విజయ్ కుమార్ జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. అయితే కాల్పుల సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు భయంతో ప్రాణాలు కాపాడుకునే క్రమంలో తప్పించుకుని ఓ గదిలో దాక్కున్నారు. వారు ఫోన్ ద్వారా తమకు సమాచారం అందించడంతోనే ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. పిల్లలను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని వివరించారు. కుటుంబ తగాదాల వల్లే విజయ్‌కుమార్‌ వారిని కాల్చి చంపాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Winter Storm In US : అమెరికాను వణికిస్తోన్న మంచు తుపాను.. ఖాళీ అవుతున్న సూపర్‌ మార్కెట్లు
Therapist Attacks Woman : మసాజ్‌ సర్వీస్‌ రద్దు చేసుకున్నందుకు మహిళపై థెరపిస్ట్‌ దాడి.. షాకింగ్‌ వీడియో

Latest News