అమెరికా (America)ను మంచు తుపాను వణికిస్తోంది (Heavy Snow Storm). అనేక రాష్ట్రాల్లో విపరీతంగా మంచు పడుతోంది. తీవ్రమైన మంచు కారణంగా చలి తీవ్రతకు అమెరికా వాసులు వణికిపోతున్నారు. అమెరికన్లు ప్రస్తుతం వాతావరణ అత్యవసర స్థితిని ఎదుర్కొంటున్నారు. గడ్డ కట్టే చలిలోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విపరీతంగా మంచు కురుస్తుండటంతో రోడ్డు, వాయు మార్గాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది.
శుక్రవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకూ మంచు తుపాను తీవ్రంగా ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు టెక్సాస్, న్యూయార్క్, షికాగో సహా మొత్తం 17 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. గడ్డకట్టే చలి, మంచు వర్షం, ఈదురుగాలుల తీవ్రత దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ ప్రకటించారు. దాదాపు 16 కోట్ల మంది ప్రజలపై ఈ తుపాను ప్రభావం పడనుంది.
వేలాది విమానాలు రద్దు..
ఈ తుపాను ప్రభావంతో డల్లాస్, అట్లాంటా, ఓక్లహోమా తదితర ప్రాంతాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక అమెరికా వ్యాప్తంగా మంచు తుపాను ప్రభావంతో శుక్రవారం సాయంత్రం వేలాది విమానాలు ఆలస్యం, రద్దు అయ్యాయి. ఇప్పటికే 2,700 విమానాలను ఎయిర్ లైన్స్ సంస్థలు రద్దు చేశాయి (Flights Cancelled). టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలకు రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. వారాంతంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జాగ్రత్తగా ఇంటి పట్టునే ఉండాలని సూచిస్తున్నారు.
ఖాళీ అవుతున్న సూపర్ మార్కెట్లు..
తీవ్రమైన తుపాను హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమయ్యారు. గ్రాసరీస్ కోసం సూపర్ మార్కెట్లకు (supermarkets) పోటెత్తారు. నాలుగు నుంచి ఐదు రోజుల పాటూ బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ముందు జాగ్రత్తగా ఆహార పదార్థాలు, వాటర్ క్యాన్లు, పాలు వంటివి తెచ్చుకుంటున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో సూపర్ మార్కెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Davos WEF Viral Video | దావోస్‌కు పోటెత్తుతున్న హైప్రొఫైల్ ఎస్కార్ట్స్! ఒక్క రాత్రి సుఖానికి 2,500 డాలర్లు! వైరల్ వీడియో సంచలనం!!
Bhu Bharathi | భూ భారతిలో సవరణలకు మరో మూడు నెలలే.. ఏప్రిల్ 14 దాటితే దరఖాస్తులన్నీ బుట్టదాఖలు!
