విస్కీ బాటిల్‌కు వేలంలో పలికిన ధర వింటే మత్తు వదిలిపోద్ది!

మ‌త్తుతో కిక్కు ఎక్క‌డానికి చాలా మంది మందు బాబులు విస్కీని పుచ్చుకుంటారు. అయితే అలాంటి ఓ విస్కీ బాటిల్ ధ‌ర ఎంతో తెలుసుకుంటే ఆ మ‌త్తు దిగిపోవ‌డం ఖాయం. ద మెక‌ల్లాన్ 1926 (The macallan 1926) అనే ఆ విస్కీ బాటిల్ వేలంలో అక్ష‌రాలా రూ.22 కోట్ల (2.7 మిలియ‌న్ డాల‌ర్లు)కు అమ్ముడు పోయింది.

  • Publish Date - November 19, 2023 / 08:55 AM IST

విధాత‌: మ‌త్తుతో కిక్కు ఎక్క‌డానికి చాలా మంది మందు బాబులు విస్కీని పుచ్చుకుంటారు. అయితే అలాంటి ఓ విస్కీ బాటిల్ ధ‌ర ఎంతో తెలుసుకుంటే ఆ మ‌త్తు దిగిపోవ‌డం ఖాయం. ద మెక‌ల్లాన్ 1926 (The macallan 1926) అనే ఆ విస్కీ బాటిల్ వేలంలో అక్ష‌రాలా రూ.22 కోట్ల (2.7 మిలియ‌న్ డాల‌ర్లు)కు అమ్ముడు పోయింది. ఈ సింగిల్ మాల్ట్ విస్కీని శ‌నివారం సోత్‌బై వేలం (Sotheby’s Auction) లో ప్ర‌ద‌ర్శించ‌గా ఈ రేంజ్‌లో ధ‌ర ప‌లికింది. త‌ద్వారా ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌ర‌కు అమ్ముడుపోయిన స్కాచ్ విస్కీ (Scotch Whisky)గా ఇది రికార్డుల‌కెక్కింది.


ఈ అరుదైన విస్కీ బాటిల్‌కు 1.49 మిలియ‌న్ డాల‌ర్లు వ‌స్తాయ‌ని వేలం నిర్వాహ‌కులు అంచ‌నా వేయ‌గా.. దానిని అధిగ‌మించి 2.7 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు దాని విలువ వెళ్లిపోయింది. త‌ద్వారా భ‌విష్య‌త్తులో జ‌రిగే ఏ ఆల్క‌హాల్ డ్రింక్ వేలానికైనా ఇదే బెంచ్ మార్క్‌గా నిల‌వ‌నుంద‌ని సోత్‌బై నిర్వాహ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఎంతో అరుదుగా భావించే ఈ మెక‌ల్లాన్ 1926 విస్కీ బాటిల్ అత్య‌ధిక ధ‌ర‌కు వేలంలో అమ్ముడుపోవ‌డం ఇదే తొలిసారి కాదు. 2019లో జ‌రిగిన ఒక వేలంలో సుమారు 1.86 మిలియ‌న్ డాల‌ర్లు ప‌లికి అందరి దృష్టినీ ఆక‌ర్షించింది.


అయితే ఈ బ్రాండ్ విస్కీకి ఎందుకు ఇంత విలువ అనే అంశంపై సోత్‌బే అధిప‌తి జానీ ఫాలే వివ‌ర‌ణ ఇచ్చాడు. ఈ విస్కీలో ఒక్కటంటే ఒక్క డ్రాప్ రుచి చూడ‌టానికి నాకు అనుమ‌తి ల‌భించింది. దాని రుచి అత్య‌ద్భుతం. ఆ ఒక్క బాటిల్‌లో ఎంతో విలువైన, అరుదైన డ్రైఫ్రూట్స్ రుచి ఉంటుంది. ఎంతో స్పైసీగా అదో ర‌క‌మైన వాస‌న‌తో మ‌త్తెక్కేలా ఉంటుంది అని పేర్కొన్నాడు. ఇప్పుడు వేలంలో అమ్ముడుపోయిన విస్కీ ఏకంగా 60 ఏళ్లు గాఢ‌మైన యురోపియన్ ఓక్ వృక్షంలో ఉంచిన‌ద‌ని జానీ తెలిపాడు.


దీంతో విస్కీ రంగుకి, రుచికి ఒక కొత్త‌ద‌నం వ‌చ్చిందని వెల్ల‌డించాడు. 1986లో ఆ విస్కీని బాటిలింగ్ చేయ‌డానికి ముందు ఆ స‌ర‌కు అంతా ఓక్ చెట్లలో ఆరు ద‌శ‌బ్దాలు నిల్వ ఉంది. త‌ర్వాత ఆ విస్కీతో 40 బాటిళ్ల‌ను మాత్ర‌మే ఉత్ప‌త్తి చేశారు. అయితే అన్నింటినీ అమ్మ‌లేదు. కొన్నింటిని మెక‌ల్లాన్‌కు చెందిన ఉన్న‌త‌స్థాయి క‌స్ట‌మ‌ర్ల‌కు బ‌హుమ‌తిగా ఇచ్చారు అని వివ‌రించాడు.

Latest News