Viral Video | ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. ఆ వింతలు, విచిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కొందరు భయంకరమైన స్టంట్లు కూడా చేస్తుంటారు. అలాంటి సన్నివేశాలకు కొందరు ఫిదా అవుతుంటారు. మరికొందరు మండిపడుతుంటారు.
ఇక కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని తన తలపై పెట్టుకుని, బస్సు టాప్‌పైకి ఎక్కిన సంఘటన చూశాం. రెండు రోజుల క్రితం ఓ మహిళ తన నెత్తిపై సిలిండర్ పెట్టుకుని డ్యాన్స్ చేసిన సన్నివేశాన్ని చూశాం. తాజాగా ఓ వ్యక్తి తన తలపై ఏకంగా ఫ్రిడ్జ్‌ను పెట్టుకుని సైకిల్ తొక్కుతూ ముందుకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి తన తలపై ఫ్రిడ్జ్‌ను పెట్టుకుని ఆ ఫ్రిడ్జ్‌ను పట్టుకోకుండా, సైకిల్ తొక్కుతూ ఎక్కడా అపకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఆ యువకుడి స్టంట్‌ను అక్కడున్న వారంతా తమ కెమెరాల్లో బంధించారు. అనంతరం వైరల్ చేశారు. అయితే ఈ భయంకరమైన స్టంట్ న్యూయార్క్ లో చేసినట్లు తెలిసింది.