యువ‌తికి కారును బ‌హుమ‌తిగా ఇచ్చిన ఓ సంస్థ‌ ప్రెసిడెంట్.. కార‌ణం ఏమిటంటే!

దుర‌దృష్టంలో కూడా అదృష్టం త‌లుపు త‌ట్ట‌డం అంటే ఏంటో డానియెలే అనే యువ‌తిని అడిగితే తెలుస్తుంది. త‌న కారు మొత్తం నిప్పుల్లో చిక్కుకుని బూడిదై పోవ‌డంతో ఆమె బాధ‌ప‌డుతూ ఒక వీడియోను పోస్ట్ చేసింది

  • Publish Date - November 19, 2023 / 08:48 AM IST

విధాత‌: దుర‌దృష్టంలో కూడా అదృష్టం త‌లుపు త‌ట్ట‌డం అంటే ఏంటో డానియెలే అనే యువ‌తిని అడిగితే తెలుస్తుంది. త‌న కారు మొత్తం నిప్పుల్లో చిక్కుకుని బూడిదై పోవ‌డంతో ఆమె బాధ‌ప‌డుతూ ఒక వీడియోను బుధ‌వారం పోస్ట్ చేసింది. అందులో మాట్లాడుతూ.. కాలిపోయిన కారు లోప‌ల చూపిస్తూ ఒక్కో దాని గురించి చెప్పింది. అందులో భాగంగా కారులో త‌న వెంట ఉండే టంబ్ల‌ర్ (డ్రింక్‌ను తాగే ఒక గ్లాస్‌)ను చూపిస్తూ… కారు మొత్తం బూడిదై పోయినా ఇది మాత్రం చెక్కుచెద‌ర్లేద‌ని చూపించింది. అంతే కాకుండా అందులో చ‌ల్ల‌ద‌నం కోసం తాను వేసిన ఐస్ కూడా ఇంకా అలానే ఉంద‌ని షేక్ చేసి మ‌రీ చూపించింది.