డొనాల్డ్ ట్రంప్‌ ఇంట విషాదం !

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ట్రంప్‌ సోదరి రిటైర్డ్ అమెరికా ఫెడరల్ జడ్జి మెరియన్ ట్రంప్ భారీ(86) సోమవారం మృతి చెందారు

  • Publish Date - November 14, 2023 / 10:46 AM IST

వాషింగ్ టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ట్రంప్‌ సోదరి రిటైర్డ్ అమెరికా ఫెడరల్ జడ్జి మెరియన్ ట్రంప్ భారీ(86) సోమవారం మృతి చెందారు. న్యూయార్క్ నగరం అప్పర్ ఈస్ట్ సైడ్ లోని తన ఇంటిలో సోమవారం తెల్లవారుజామున మేరియన్ మరణించినట్లు గార్డియన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే మేరియన్ మృతికి అసలు కారణాలు ఏమిటనేది తెలియ రాలేదు.


ఫ్రెడ్ ట్రంప్, మేరీయన్‌ అన్నే మాక్లియడ్‌ ట్రంప్‌లకు నలుగురు పిల్లలు. కాగా మేరియన్ ట్రంప్ భారీ మూడో సంతానం. న్యూ జెర్సీలో ఫెడరల్ న్యాయమూర్తిగా పనిచేసిన మేరియన్ 2019లో పదవీ విరమణ పొందారు. 1974లో అసిస్టెంట్ అమెరికా అటార్నీగా తన వృత్తిని ఆమె ప్రారంభించారు. తమ్ముడు డోనాల్డ్ ట్రంప్ తో మెరియన్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. గత ఏడాది మేరియన్ సోదరుడు రాబర్ట్ ట్రంప్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసింది.