విధాత: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి అంతరిక్షంలోకి జారిపోయిన శాస్త్రవేత్తల టూల్‌కిట్ (NASA Tool Bag) కు సంబంధించి నాసా (NASA) కీలక ప్రకటన చేసింది. ఈ కిట్ మంగళవారం (నవంబర్ 21న) భూమిపై ఉన్నవారికి కనిపిస్తుందని తెలిపింది.
అయితే బ్రిటన్ వాసులకే ఈ అదృష్టం దక్కనుంది. వారు ఉన్న ప్రాంతంపైకి మంగళవారం అది దగ్గరగా రానుండటంతో ఎటువంటి ప్రత్యేక పరికరాల సాయం లేకుండా ప్రతి ఒక్కరూ దానిని చూడొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
మంగళవారం సాయంత్రం 5:30 నుంచి 5:41ల మధ్య ఆకాశంలో ప్రకాశిస్తూ టూల్ కిట్ ప్రయాణిస్తుందని తెలిపారు. అయితే ఆ సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంటేనే ఆ వస్తువును చూడగలమని.. బైనాక్యులర్స్, టెలిస్కోప్ ఉంటే ఇంకా మంచిదని స్పేస్ (Space) ఔత్సాహికులు చెబుతున్నారు.
Last seen by @Astro_Satoshi while floating over Mount Fuji