Tsunami Warning | రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.4 గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో సునామీ కూడా వచ్చే అవకాశం ఉందని సునామీ హెచ్చరికల కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్కా నగరానికి 144 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. పసిఫిక్ మహా సముద్రంలో భూకంప కేంద్రంగా ఉంది. గంట వ్యవధిలోనే వరుసగా ఐదుసార్లు భూకంపాలు వచ్చాయి. దీంతో సునామీ వచ్చే అవకాశం ఉందని యూఎస్‌లోని నేషనల్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ భూకంపాలతో భారీ భవనాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రాణ నష్టం గురించి ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.
రష్యాలోని కమ్చట్కా ద్వీపం ఉన్న ప్రాంతాన్ని ఫసిఫిక్ రింగ్ ఆఫ్ పైర్ లో భాగంగా పరిణిస్తారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా అగ్నిపర్వతాలున్నాయి. టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలో ఈ ప్రాంతం ఉంది. ఈ ఏడాది జూన్ 13న కురిల్ దీవుల్లో 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ఏడాది జనవరి 26న కమ్చట్కా ప్రాంత తూర్పు తీరానికి సమీపంలో 5.5 తీవ్రతతో భూమి కంపించింది.
ఇవి కూడా చదవండి..
Tectonic Interactions | మీరు నమ్మలేరు.. రెండు ముక్కలుగా చీలనున్న భారతదేశం!
Earthquake Hyderabad | హైదరాబాద్ సిలికాన్ వ్యాలీ భద్రమేనా?
earthquake : మేడారం అడవుల కేంద్రంగా భూప్రకంపనలు.. నిపుణులకు పరీక్షగా మారిన ప్రాంతం