South Africa President : దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా మరోసారి 71 ఏళ్ల సిరిల్ రమాఫోసా (Cyril Ramaphosa) ఎన్నికయ్యారు. పోయిన నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రమాఫోసాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. కానీ సొంతంగా అధ్యక్ష పదవికి చేపట్టేందుకు కావాల్సిన మెజారిటీని సాధించలేకపోయింది. ఆ పార్టీ గత మూడు దశాబ్దాల్లో మెజారిటీని కోల్పోవడం ఇదే తొలిసారి.
మెజారిటీ దక్కకపోవడంతో రమాఫోసా ప్రత్యర్థులను అడ్డుకొని సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసేందుకు డెమోక్రటిక్ అలయెన్స్‌తో చారిత్రక ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. మొత్తం 400 స్థానాలు ఉన్న దక్షిణాఫ్రికా పార్లమెంట్‌లో రమాఫోసాకు 283 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి అయిన ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ అభ్యర్థి మలేమాకు 44 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో రమాఫోసా మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.