Gorillas-Chimpanzees | విచ్చలవిడిగా అడవుల్లో మైనింగ్‌..! ప్రమాదంలో గొరిల్లా, చింపాంజీల మనుగడ..!

Gorillas-Chimpanzees | ఖనిజాలకు పెరుగుతున్న డిమాండ్‌తో ఆఫ్రికాలో మైనింగ్‌ కార్యకలాపాల్లో భారీగా పెరుగుదలకు దారి తీస్తున్నది. విచ్చలవిడిగా సాగుతున్న మైనింగ్‌ కారణంగా అడవులు నాశనమవుతున్నాయి. దాంతో రెండున్నర లక్షల గొరిల్లాలు, చింపాంజీల ఉనికి ప్రమాదంలో పడింది. ఈ విషయం పరిరక్షణ సంస్థ రీ-వైల్డ్‌తో కలిసి జర్మన్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బయోడైవర్సిటీ రీసెర్చ్, మార్టిన్ లూథర్ యూనివర్శిటీ హాలీ-విట్టెన్‌బర్గ్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

  • Publish Date - April 21, 2024 / 07:43 AM IST

Gorillas-Chimpanzees | ఖనిజాలకు పెరుగుతున్న డిమాండ్‌తో ఆఫ్రికాలో మైనింగ్‌ కార్యకలాపాల్లో భారీగా పెరుగుదలకు దారి తీస్తున్నది. విచ్చలవిడిగా సాగుతున్న మైనింగ్‌ కారణంగా అడవులు నాశనమవుతున్నాయి. దాంతో రెండున్నర లక్షల గొరిల్లాలు, చింపాంజీల ఉనికి ప్రమాదంలో పడింది. ఈ విషయం పరిరక్షణ సంస్థ రీ-వైల్డ్‌తో కలిసి జర్మన్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బయోడైవర్సిటీ రీసెర్చ్, మార్టిన్ లూథర్ యూనివర్శిటీ హాలీ-విట్టెన్‌బర్గ్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దీనిపై దృష్టి సారించకపోతే ఆయా జీవుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఆయా జీవులు ఐయూసీఎన్‌ రెడ్‌లిస్ట్‌లో ఉన్నాయి.

అధ్యయనంలో 17 ఆఫ్రికన్‌ దేశాల మైనింగ్‌ రంగాలకు చెందిన డేటాను పరిశీలించారు. అధ్యయనంలో పరిశోధకులు క్లిష్టమైన ఖనిజాల కోసం పెరుగుతున్న డిమాండ్ గుర్తించారు. స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు ప్రపంచం పెరుగుతున్న ఆసక్తితో ఈ ఖనిజాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఖనిజాలకు పెరుగుతున్న డిమాండ్ ఆఫ్రికాలో మైనింగ్ కార్యకలాపాలలో భారీ పెరుగుదలకు దారి తీస్తున్నది. విచ్చలవిడి తవ్వకాలతో అడవులు నాశనం అవుతున్నాయి. దాంతో గొరిల్లాలు, చింపాంజీల మనుగడకు ముప్పు పొంచి ఉన్నది. గొరిల్లా, చింపాంజీ, బోనోబో, ఒరంగుటాన్ మైనింగ్‌ కార్యకలాపాలతో ప్రభావితమవుతున్నాయి. ప్రస్తుతం 82శాతం వరకు ఆయా జీవులు మైనింగ్‌ ప్రదేశాలకు సమీపంలోనే జీవిస్తున్నాయి. ప్రస్తుతం వాటి ఆవాసాల చుట్టూ పెరుగుతున్న మానవ జోక్యం కారణంగా మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest News