విధాత : ఓ యువకుడు సరదగా అభయారణ్యంలో సఫారీకి వెళ్లి సింహం నోటికి చిక్కబోయి తప్పించుకున్న ఘటన వైరల్ గా మారింది. భారీ సింహాలకు నెలవైన అఫ్రికా దేశంలో ఓ యువకుడు జంగిల్ సఫారీకి వెళ్లాడు. అక్కడ కారు దిగిన సేద తీరే సమయానికి ఓ భారీ సింహం అతడున్న ప్రాంతానికి వచ్చింది. సింహాన్ని చూడగానే దెబ్బకు పై ప్రాణాలు పైన పోయి భయంతో బిక్క చచ్చిపోయిన యువకుడు దాని బారీ నుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న ఓ చెట్టుపైకి గబగబా ఎక్కేశాడు. చెట్టు కింద సింహం అతను ఎప్పుడు కిందకు వస్తాడా..తినేద్దాం అన్నట్లుగా అతడినే గమనిస్తూ చెట్టుపైకి చూస్తూ చెట్టు కిందనే ఎదురుచూస్తుంది.
ఎంతకు అది అక్కడి నుంచి వెళ్లకపోవడం..మరేదైనా చెట్టు ఎక్కే జంతువు వస్తే తన పరిస్థితి ఏమిటన్న భయంతో ఆ యువకుడు గజగజా వణికిపోతూ చెమటలు పడుతూ చెట్టుపైనే సహాయం కోసం ఎదురుచూస్తుండిపోయాడు. కొన్ని గంటల తర్వాత కారులో వెళ్లిన యువకుడి జాడ వెతుకుతూ ఫారెస్టు సిబ్బంది అటుగా వచ్చి ఆ యువకుడిని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు ఏముంది మామా మనోడు చెట్టుపై ఉన్నా..ప్రాణాలు మాత్రం సింహాన్ని చూడగానే ఎప్పుడో ఎగిరిపోయాయంటూ కామెంట్లు పెడుతున్నారు.