Russian Aeroflot Airlines Hacked | విధాత : రష్యన్ ఎయిర్‌లైన్ దిగ్గజం ఏరోఫ్లాట్ నెట్ వర్క్ వ్యవస్థలను తాము హ్యాకింగ్ చేశామని హ్యాకర్లు ప్రకటించారు. సైలెంట్ క్రో, బెలారసియన్ సైబర్-పార్టిసన్స్ గ్రూపులు ఈ హ్యాకింగ్ కు పాల్పడ్డాయి. ఏరోప్లాట్ కంపెనీ ఐటీ మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేశామని హ్యకర్లు ప్రకటించారు. ఈ ఆపరేషన్ ఒక సంవత్సరం పాటు కొనసాగిందని..ఏరోఫ్లాట్ అంతర్గత వ్యవస్థల పూర్తి పతనం చేశామని హ్యకర్లు తమ ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 7,000 సర్వర్లు తుడిచిపెట్టబడ్డాయని..20 టెరా బైట్ల డేటా చోరీ జరిగిందని ఏరోప్లాట్ వర్గాల సమాచారం.
“క్లిష్టమైన మౌలిక సదుపాయాలను” రక్షించడంలో విఫలమైన రష్యన్ నిఘా సంస్థలకు హ్యాకర్లు తమ దాడి సమాచారం వెల్లడించారు. “సందేశం(మేసేజ్)” అనే పేరుతో తాము ఈ సైబర్ దాడిని నిర్వహించామని వెల్లడించారు. త్వరలో డేటాను లీక్ చేయడం ప్రారంభిస్తామని హ్యాకర్లు ప్రకటించారు.
హ్యాకర్ల దాడి నేపథ్యంలో ఏరోఫ్లాట్ సంస్థ తమ “సిస్టమ్ స్తంభించిపోయింది” అని ఓ ప్రకటనలో పేర్కొంది. 40కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామాలతో షెరెమెటివో విమానాశ్రయంలో గందరగోళం చెలరేగింది. విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో వందలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు, కొందరు టెర్మినల్ నుండి నిష్క్రమించడానికి కూడా పొడవైన క్యూలలో చిక్కుకున్నారు.
