విధాత: ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తున్నది. ఈ క్రమంలో కంపెనీలు పోటీపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌లను తీసుకువస్తున్నాయి. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ విజయవంతమైన తర్వాత ప్రముఖ కంపెనీలన్నీ చాట్‌బాట్‌లను పరిచయం చేశాయి. గూగుల్ బార్డ్, కో పైలట్, డిస్కార్డ్ క్లైడ్ ఏఐ, స్నాప్ మై ఏఐ చాట్‌బాట్‌ను ఆయా కంపెనీలు తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఇన్‌స్టెంట్ మెస్సేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ సైతం సొంతంగా ఏఐ చాట్‌బాట్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. యూజర్లకు ప్రత్యేకంగా యాప్‌లో ఓ బటన్‌ను తీసుకురాబోతున్నది.
కొత్త చాట్‌లను ప్రారంభించేందుకు లోగోపై ఉన్న చాట్స్ ట్యాబ్‌లో కొత్త బట్‌ను తేబోతున్నది. ఈ బటన్‌తో ఏఐ ఆధారిత చాట్‌లను స్పీడ్‌గా తెరవడం వీలవుతుంది. అలాగే యూజర్లకు మరింత సులువైన చాట్ ఎక్స్‌పీరియన్స్‌ను సైతం అందుతుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. వాట్సాప్ ఇప్పటికే బీటా యూజర్స్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను పొందుపరిచింది. కానీ, దాన్ని వెతకడం, వాడడం ఇబ్బందిగా మారిందనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో ప్రత్యేకంగా బటన్‌ను హోం స్క్రీన్‌పై పొందుపరుచబోతున్నది. ఇది ఆండ్రాయిడ్ 2.23.24.26 వర్షన్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తున్నది. ఈ బటన్ కుడి దిగువ మూలన ‘న్యూ చాట్’పై ఉంటుంది. తెల్లటి చతురస్రాకార బటన్.. దానిపై మల్టికలర్ రింగ్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేస్తే మెటా ఏఐ చాట్‌బాట్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం వాట్సాప్ బీటాలో మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే యూజర్లందరికీ పరిచయం చేయనున్నట్లు సమాచారం.