SonInLaw Protest| అత్తారింటి ఎదుట అల్లుడి వినూత్న నిరసన

ఓ అల్లుడు తన అత్తారింటి ఎదుట నిర్వహిస్తున్న వినూత్న నిరసన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్తింటి వారు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ అత్తారింటి ముందు బాధిత అల్లుడు ‘498ఏ టీ కేఫ్’ పేరుతో ఒక టీ-స్టాల్ పెట్టాడు.

విధాత : ఓ అల్లుడు(SonInLaw Protest) తన అత్తారింటి ఎదుట నిర్వహిస్తున్న వినూత్న నిరసన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్తింటి వారు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ అత్తారింటి ముందు బాధిత అల్లుడు ‘498ఏ టీ కేఫ్’ పేరుతో ఒక టీ-స్టాల్(498A Tea Cafe Protest)పెట్టి కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే మధ్య ప్రదేశ్‌లోని అథన గ్రామస్థుడు కృష్ణ కుమార్‌ ధాకడ్‌ (33)పై 2022లో భార్య గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టింది. తనపై భార్య తప్పుడు కేసులు పెట్టిందని..దీంతో తాను మానసిక క్షోభకి గురవ్వడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కున్నానంటూ బాధిత అల్లుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందుకే ఇందుకు కారణమైన భార్య, అత్తారింటి ఎదుట ఇలా తనపై పెట్టిన తప్పుడు కేసు సెక్షన్ పేరుతో ‘498ఏ టీ కేఫ్’ టీ-స్టాల్ పెట్టుకొని నిరసన తెలుపుతున్నానని వెల్లడించాడు. తన చేతులకు సంకెళ్లు వేసుకొని మరీ.. ఈ టీ-స్టాల్‌ని భార్య బాధితుడు ప్రారంభించాడు. తన పెళ్లి తలపాగాను, పూలదండను టీ స్టాల్ కు వేలాడదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘న్యాయం జరిగే వరకు టీ మరుగుతూనే ఉంటుంది’, ‘టీ తాగుతూ మాట్లాడుకుందాం.. సెక్షన్‌ 125 కోసం మనం ఎంత చెల్లించాలి?’ అనే నినాదాలతో కూడిన బ్యానర్లను తన టీ స్టాల్‌లో రాశారు.

రాజస్థాన్‌కు చెందిన కృష్ణ కుమార్ ధాకడ్ కు 2018లో మీనాక్షి మాలవ్‌ అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులు తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని స్టార్ట్ చేసి.. ఇతరులకు కూడా ఉపాధి కల్పించారు. దీంతో వీరికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే కొన్ని రోజుల తర్వాత తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భార్య తన పుట్టింటికి వెళ్లిపోయిందని.. నెలల తర్వాత వరకట్న వేధింపుల సెక్షన్ 498ఏ, సెక్షన్ 125 కింద కేసులు పెట్టిందని కృష్ణ కుమార్ తెలిపాడు. విడాకులకు అంగీకరించాలంటే రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసిందన్నారు. తమ ఉమ్మడి ఆస్తిని కూడా ఆమె తీసుకుందని బాధితుడు వాపోయాడు.

Exit mobile version