విధాత : చావు ఎప్పుడు..ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేమంటారు. అది నిజమేననడానికి ఓ వృద్దుడికి వచ్చిన అనూహ్య మరణం(unexpected death) నిదర్శనంగా నిలిచింది. చలి కాలం ఎండ వెడికి ఇంటి ముందు అరుగుపై కూర్చున్న వృద్ధుడిని మృత్యువు రోడ్డున పోయే ట్రక్ రూపంలో కబళించిన ఘటన వీడియో వైరల్(Viral video) గా మారింది.
మధ్యప్రదేశ్(madhya pradesh)లోని గ్వాలియర్(gwalior lorry accident)లో 90 ఏళ్ల గిరిరాజ్ శర్మ(giriraj sharma death) అనే వృద్దుడు చలిని నుంచి రక్షణకు ఉదయం ఎండ కాచుకునేందుకు తన ఇంటి బయట అరుగుపై ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. అంతలోనే విధి ఆడిన క్రూరమైన నాటకంలో ఇంటి ముందు నుంచి వెలుతున్న కంకర లోడు టిప్పర్ లారీ ఒక టైరు పగిలిపోయింది. కంకర లోడుతో వెళ్తున్న ఆ టిప్పర్ లారీ వెంటనే అదుపు తప్పి ఇంటిముందు అరుగుపై కూర్చున్న గిరిరాజ్ శర్మపై బోల్తా పడింది.
అకస్మాత్తుగా ఎలాంటి ముందస్తు సూచనలు కూడా లేకుండా..ఏమాత్రం తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో గిరిరాజ్ ప్రాణాలు క్షణాల్లోనే గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనతో ఒక ప్రశాంతమైన క్షణం.. కనురెప్పపాటులో ఊహించలేని విషాదంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
𝑵𝒐 𝒐𝒏𝒆 𝒌𝒏𝒐𝒘𝒔 𝒘𝒉𝒆𝒏 𝒅𝒆𝒂𝒕𝒉 𝒘𝒊𝒍𝒍 𝒂𝒓𝒓𝒊𝒗𝒆…
In Gwalior, Madhya Pradesh, 90-year-old Girraj Sharma was simply sitting outside his home, quietly soaking in the winter sun. In a cruel twist of fate, a gravel-laden dumper lost control after a tyre burst and… pic.twitter.com/uAdXECIaxM
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 21, 2025
