విధాత : అధునిక సాంకేతిక విజ్ఞానంలో..ఏఐ రోబోల వినియోగంలో చైనా ప్రపంచంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ట్రాఫిక్ విధులు..ప్రకృతి వైపరిత్యాలు..సముద్ర పరిశోధనలతో పాటు వ్యవసాయ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైనా హ్యూమనాయిడ్ రోబోట్ లను వినియోగిస్తుంది. చైనాలో హ్యూమనాయిడ్ రోబోట్ ల వినియోగం అన్ని రంగాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా ఓ నృత్య ప్రదర్శనలోనూ రోబోట్ లు తమ డాన్స్ ఫెర్ఫార్మెన్స్ తో ప్రపంచాన్ని అబ్బురపరిచాయి. రోబోట్ ల డాన్స్ షో చూసిన ఎలాన్ మస్క్ సైతం ఇంప్రెసివ్ అంటూ కామెంట్ చేయడం చైనా రోబోల సామర్ధ్యానికి మరింత హైలెట్ చేసింది.
వివరాల్లోకి వెళితే చెంగ్డులో తాజాగా జరిగిన చైనీస్-అమెరికన్ గాయకుడు వాంగ్ లీహోమ్ మ్యూజికల్ షోలో యూనిట్రీ హ్యూమనాయిడ్ రోబోట్ లు చేసిన డాన్స్ చూసిన వారంతా ముక్కున వేలేసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అచ్చం నిపుణులైన డాన్సర్ల మాదిరిగా రోబోట్ లు డాన్స్ చేయడం చూస్తే..ఇక డాన్సింగ్ ఫీల్డ్ లోనూ మనుషులకు రోబోలతో పోటీ తప్పదనడంలో అతిశయోక్తి లేదంటున్నానరు.
మ్యూజికల్ షోవేదికపై హ్యుమనాయిడ్ రోబోలు సింక్రొనైజ్డ్ డ్యాన్స్‌లు, వెబ్‌స్టర్ బ్యాక్ ఫ్లిప్‌లతో అద్బుత డాన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచాయి. ఆరు యూనిట్రీ G1 హ్యూమనాయిడ్ రోబోట్‌లు సంగీతం, పాటకు అనుగుణంగా స్టెప్పులేశాయి. ఏఐ-ఆధారిత రోబోట్ సామర్ధ్యానికి ఈ ప్రదర్శన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ప్రపంచ రోబోటిక్స్ పేటెంట్లలో 50% కంటే ఎక్కువ చైనా దేశమే కలిగి ఉండటం..సరసమైన హ్యూమనాయిడ్ టెక్నాలజీలో చైనా ఆధిపత్యం కొనసాగిస్తుంది. తాజాగా రోబోట్ ల డాన్స్ వీడియో హ్యూమనాయిడ్ రోబోల రంగంలో చైనా సత్తాను చాటిందని నిపుణులు చెబుతున్నారు.
Impressive https://t.co/IacxCOxpki
— Elon Musk (@elonmusk) December 19, 2025
ఇవి కూడా చదవండి :
India T20 World Cup squad| టీ 20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన..గిల్ ఔట్
Rajdhani Express | ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్.. తప్పిన ప్రాణ నష్టం
