Hardik Pandya Apologize To Cameraman : కెమెరామెన్ కు సారీ చెప్పిన హర్థీక్ పాండ్యా

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో తన సిక్సర్ వల్ల గాయపడిన కెమెరామెన్‌ను హార్దిక్ పాండ్యా పరామర్శించి క్షమాపణలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Hardik Pandya Apologize To Cameraman

విధాత : దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ 20సిరీస్ లో భాగంగా అహ్మాద్ బాద్ వేదికగా జరిగిన ఆఖరి టీ 20 మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించి సిరీస్ ను 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో సఫారీ బౌలర్ బోష్‌ వేసిన 13వ ఓవర్లో హార్దిక్‌ కొట్టిన సిక్సర్‌కు భారత క్రికెటర్ హార్ధిక్ పాండ్యా కొట్టిన ఓ సిక్సర్ షాట్ తో బంతి వెళ్లి బౌండరీ వద్ద ఉన్న కెమెరామెన్ కు బలంగా తగలింది. దీంతో అతను నొప్పితో అతను కాసేపు విలవిలలాడాడు. వెంటనే అతనికి వైద్యులు ఉపశమన చికిత్స అందించారు. నొప్పి తగ్గడానికి అతను ఐస్‌ గడ్డలు వాడాడు. అయితే కెమెరామెన్ మాత్రం తన పని ఆపకుండా తన విధిని కొనసాగించడం విశేషం. ఈ మ్యాచ్ లో హర్ధీక్ 5 సిక్సర్లు, 5ఫోర్లతో 63పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా వెళ్లి తన సిక్సర్ షాట్ తో గాయపడిన ఆ కెమెరామన్‌ను పలకరించి, అతనికి క్షమాపణ చెప్పి, కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. హర్ధిక్ తన వద్దకు వచ్చి పరామర్శించడంతో సంతోషానికి లోనయ్యాడు. ఫర్వాలేదన్నట్లుగా హర్ధీక్ కు కెమెరామెన్ బదులిచ్చాడు. తను బాగానే ఉన్నానంటూ విక్టరీ సంకేతంతో వెల్లడించాడు. ఈ ఘటనపై హర్ధీక్ మాట్లాడుతూ దేవుడు మా వైపు ఉన్నాడని, అదృష్టవశాత్తు బంతి అతడి చెవి, తల భాగంలో తగలకుండా, భుజంపై తాకడంతో పెను ప్రమాదం తప్పిందని, దీనికి కారణమైన దేవుడికి కృతజ్ఞతలని తెలిపాడు. కెమెరామెన్ కు సారీ చెప్పాడు. ఈ ఘటనపై కెమెరామెన్ మాట్లాడుతూ తాను అదృష్టవంతునని, భుజంపైకి తల భాగంలో తగిలి ఉంటే తీవ్రంగా గాయపడేవాడినని..తాను ఇప్పుడు అంతా బాగానే ఉన్నానంటూ విక్టరీ సింబల్ చూపిస్తూ..టీమిండియా విజయం అనంతరం మైదానంలోకి పరుగెత్తుకెళ్లి తన కెమెరాలో భారత ఆటగాళ్లను చిత్రీకరించడం విశేషం.

కాగా ఇదే మ్యాచ్ లో 9వ ఓవర్లో సంజు శాంసన్‌ బలంగా కొట్టిన స్ట్రెయిట్‌ డ్రైవ్‌ కు బంతి ఫీల్డ్‌ అంపైర్‌ రోహన్‌ పండిట్‌ మోకాలిని బలంగా తగిలింది. నొప్పితో విలవిలలాడిన అంపైర్‌ కాసేపు కింద పడుకుండిపోయాడు. ఆ బంతిని బౌలర్‌ డొనోవన్‌ ఫెరీరా ఆపే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతడికి చేతిని తాకి రోహన్ పండిట్ ను బలంగా తాకింది. అయితే అంపైర్ రోహన్ పండిట్ కు వెంటనే వైద్యులు మైదానంలోనే చికిత్స అందించగా..వెంటనే తన అంపైరింగ్ కొనసాగించాడు.

ఇవి కూడా చదవండి :

Humanoid Robots Dance : చైనా రోబోల డాన్స్ వైరల్…ఎలాన్ మస్క్ ఇంప్రెసివ్ కామెంట్
UTI : యూరిన్ కంట్రోల్ చేసుకుంటే ప్రాణాలకే ముప్పు!

Latest News