విధాత : అమె పొలం కింగ్ కోబ్రాలకు నెలవు(King Cobra in farm) అన్నట్లుగా తరుచుగా భారీ కింగ్ కోబ్రాలు అక్కడ పట్టుబడుతున్నాయి. చూసేవారు వామ్మో అంత పెద్ద పాములా.. అంటూ భయపడిపోతుండగా..ఆమె మాత్రం ఆ నాగ రాజుల రాక దైవానుగ్రహం అంటూ మురిసిపోతుంది. తమిళనాడులోని తెన్ కాశీ(Tamil Nadu Tenkasi) ప్రాంతంలోని అక్షయ శివరామన్(Akshaya Sivaraman farm)అనే మహిళ పొలంలో తరచు భారీ కింగ్ కోబ్రాలు దర్శనమిస్తున్నాయి. వాటికి ఆమెతో సహా స్థానికులు ఎలాంటి హాని తలపెట్టకుండా అటవీ శాఖ వారికి సమాచారం అందిస్తుంటారు. వారు వాటిని చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదలడం చేస్తున్నారు.
తాజాగా మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత అక్షయ శివరామన్ పొలంలో 12అడుగుల భారీ కింగ్ కోబ్రా పట్టుబడింది. దానిని చూసిన ఆమె అదంతా నా అదృష్టం..నాకు లభించిన దైవానుగ్రహం అంటు సంతోష పడుతుంది. భారీ కింగ్ కోబ్రా సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది దానిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించారు. తన పొలంలో వరుసగా భారీ కింగ్ కోబ్రాలు దర్శనమిస్తుండటం పట్ల అక్షయ శివరామన్ మాట్లాడుతూ మొదటిసారిగా అక్టోబర్ 2021లో 12 అడుగుల కింగ్ కోబ్రా, ఆ తర్వాత నవంబర్ 2023లో 15అడుగుల కింగ్ కోబ్రా, ఇప్పుడు డిసెంబర్ 2025లో మరో కింగ్ కోబ్రా కనిపించిందని..వరుసగా మూడు భారీ కింగ్ కోబ్రాలు దర్శనమిచ్చాయని తెలిపారు. ఇది చాలామందికి భయాన్ని కలిగించవచ్చుగాని.. నాకు మాత్రం ఇది అత్యంత దైవికమైన అనుభూతి అని చెప్పుకొచ్చింది.
Again, after two years, I’m blessed to encounter the majestic Kind Cobra in our farm.
First was in October 2021. Then, in November 2023. Now, in December 2025.
This may bring fear for many but for me, it is deeply divine ❤️
What an auspicious day 🙏 https://t.co/Xn1OnDav2l pic.twitter.com/dEHiC73UWz
— Akshaya Sivaraman (@AksUnik) December 20, 2025
