Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు కౌంట్‌డౌన్ ప్రారంభం .. విన్న‌ర్ ఎవరో తేల్చేసిన ఏఐ

Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఆదివారం (డిసెంబర్ 21) అట్టహాసంగా జరగనున్న ఫినాలే ఎపిసోడ్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. సెప్టెంబర్ 7, 2025న ప్రారంభమైన ఈ రియాలిటీ షో దాదాపు నాలుగు నెలల పాటు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఎవరు బిగ్ బాస్ ట్రోఫీ అందుకుంటారనే ఉత్కంఠతో ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఆదివారం (డిసెంబర్ 21) అట్టహాసంగా జరగనున్న ఫినాలే ఎపిసోడ్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. సెప్టెంబర్ 7, 2025న ప్రారంభమైన ఈ రియాలిటీ షో దాదాపు నాలుగు నెలల పాటు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఎవరు బిగ్ బాస్ ట్రోఫీ అందుకుంటారనే ఉత్కంఠతో ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కామనర్లు, సెలబ్రిటీలు కలిసి హౌస్‌లో అడుగుపెట్టి టాస్కులు, గొడవలు, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక ఇప్పుడు రియాలిటీ షో తుది అంకానికి చేరుకోవడంతో ఐదుగురు ఫైనలిస్టులు టైటిల్ రేస్‌లో నిలిచారు.

టైటిల్ కోసం పోటీపడుతున్న టాప్-5

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ట్రోఫీ కోసం తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ పోటీపడ్డారు. వీరి కోసం ఆన్‌లైన్ ఓటింగ్ కూడా పూర్తి అయింది. అయితే లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఫైనల్ రేస్ మరింత కుదించబడినట్లు సమాచారం. ఓటింగ్ ట్రెండ్స్‌ను బట్టి ఇమ్మాన్యుయేల్, సంజన ఇప్పటికే ఎలిమినేట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్ టాప్-3లో నిలిచినట్లు తెలుస్తోంది.

ఓటింగ్ ట్రెండ్స్‌లో గట్టి పోటీ

లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. కొన్ని సోర్సెస్‌లో తనూజ ముందంజలో ఉన్నట్లు చెబుతుండగా, మరికొన్ని మాత్రం కళ్యాణ్ పడాలే విన్నర్‌గా మారే అవకాశాలు ఎక్కువని పేర్కొంటున్నాయి. మరోవైపు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్‌తో డీమాన్ పవన్ కూడా గట్టిగానే పోటీనిస్తున్నాడు. ప్రస్తుతం అతను మూడో స్థానంలో ఉన్నట్లు సమాచారం.

ఏఐ అంచనాలు ఏం చెబుతున్నాయంటే?

ఇదిలా ఉండగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్‌పై ఆసక్తికర అంచనాలు వేసింది. లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్, సోషల్ మీడియా బజ్, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ వంటి అంశాలను విశ్లేషించిన ఏఐ…కళ్యాణ్ పడాలే బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని అంచనా వేసింది.

కళ్యాణ్‌కు మాసివ్ ఫ్యాన్ బేస్ ఉండటంతో పాటు, సైలెంట్ వోటర్స్ కూడా అతనికే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారని ఏఐ తెలిపింది. ఇక తనూజ పుట్టస్వామి రన్నరప్‌గా నిలిచే ఛాన్స్ ఎక్కువ అని పేర్కొంది. డీమాన్ పవన్‌కు మంచి సపోర్ట్ ఉన్నప్పటికీ టాప్-2కి చేరడం కాస్త కష్టమేనని ఏఐ విశ్లేషించింది. మరి ఏఐ అంచనాలు నిజమవుతాయా? లేదా ప్రేక్షకుల ఓటింగ్ మరో ట్విస్ట్ ఇస్తుందా? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఏదేమైనా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

Latest News