Ashes third Test| యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి

యాషెస్ సిరీస్ లో భాగంగా అడిలైడ్ వేదికగా అస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. అస్ట్రేలియా 82పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి మూడో టెస్టుతో పాటు ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ను మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే 3-0 తో కైవసం చేసుకుంది.

విధాత : యాషెస్ సిరీస్(Ashes third Test) లో భాగంగా అడిలైడ్ వేదికగా అస్ట్రేలియా(Australia vs England)తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. అస్ట్రేలియా 82పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి మూడో టెస్టుతో పాటు ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ను మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే 3-0 (Australia win Ashes 3-0)తో కైవసం చేసుకుంది. నాలుగో టెస్టు డిసెంబరు 26న మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభంకానుంది. మూడో టెస్టులో 435 పరుగుల లక్ష్యఛేదనలో.. 207/6తో ఐదో రోజు ఆదివారం ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్.. అద్బుతాలు ఏవి చేయకండానే అసీస్ బౌలర్లకు తలొగ్గి 352 పరుగులకు ఆలౌటైంది.

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లలో ఓపెనర్ జాక్ క్రాలీ (85), జెమీ స్మిత్ (60), విల్ జాక్స్ (47) రాణింంచారు. జో రూట్ (39), బ్రైడన్ కార్స్ (39*), హ్యారీ బ్రూక్ (30) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, పాట్ కమిన్స్ 3, నాథన్ లైయన్ 3, స్కాట్ బోలాండ్ ఒక వికెట్ పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 271/4తో శనివారం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 349 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 10పరుగులకే ఔటైన ఓపెనర్ ట్రావిస్‌ హెడ్‌ రెండో ఇన్నింగ్స్ లో (170; 219 బంతుల్లో 16×4, 2×6) సూపర్ సెంచరీతో అసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లీష్ బౌలర్లలో జోష్‌ టంగ్‌ (4/70), బ్రైడన్‌ కార్స్‌ (3/80) తో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 371 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 286 పరుగులు చేశాయి. ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కేరీ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కేరీ ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 106, రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేశాడు.

Latest News