విధాత, హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల(gram panchayat election results)పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక(KCR comments)వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ హాజరయ్యారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాం అని..ఈ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు అయితే మన సత్తా మరింత బాగా తెలిసేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి నన్ను తిట్టడం, చనిపోవాలని శాపనార్ధాలు పెట్టడం..అవమానించడమే విధానంగా మారిందని, ప్రజల కోసం చేస్తుందేమి లేదని, ఎన్నికల హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.
